Pushpa: పుష్ప సినిమాపై హింట్ ఇచ్చేసిన ఫహాద్ ఫాజిల్.. పార్ట్ 3 కూడా ఉంటుందంట..

పుష్పరాజ్ ఆడిట్యూడ్, వాకింగ్ స్టైల్ ను తెగ ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

Pushpa: పుష్ప సినిమాపై హింట్ ఇచ్చేసిన ఫహాద్ ఫాజిల్.. పార్ట్ 3 కూడా ఉంటుందంట..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 20, 2022 | 7:35 AM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప (Pushpa) సినిమా ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీకి దేశవ్యాప్తంగా భారీ రెస్పా్న్స్ వచ్చింది. ఇందులో బన్నీ పోషించిన పుష్పరాజ్ పాత్రకు సౌత్ టూ నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పుష్పరాజ్ ఆడిట్యూడ్, వాకింగ్ స్టైల్ ను తెగ ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ చివరి వారంలో సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పుష్పలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఫహద్..పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చేశాడు.

ఫహాద్ మాట్లాడుతూ.. “సుకుమార్ సర్ నాకు పుష్ప స్టోరీ చెప్పినప్పుడు కేవలం కేవలం ఒక కథ మాత్రమే ఉంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ సెకండాఫ్ లో నా పాత్ర తర్వాత రెండు కథలుగా మారింది. దీంతో పుష్ప 2లోకి నా పాత్రకు ప్రమోషన్ వచ్చింది. పుష్పరాజ్ కథ కేవలం ఒక సినిమాకే సరిపోతుందని భావించిన సుకుమార్ ప్లాన్ మార్చేసి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ముందుగు దీనిని సిరీస్ గా తీయాలనుకున్నారు. కానీ అది సినిమాగా మారింది. నెట్ ఫ్లిక్స్ కోసం ఎర్రచందనం పై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకున్నారు. ఇటీవల సుకుమార్ నాతో మాట్లాడినప్పుడు పుష్ప 3 కూడా ఉండే స్కోప్ ఉందని చెప్పారు. అందుకు కావాల్సిన స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే పుష్ప 2 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఇక ఇప్పుడు పుష్ప 3 కూడా ఉందని క్లారిటీ రావడంతో ఉండడంతో ఖుషీ అవుతున్నారు. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప సెకండ్ పార్ట్ లో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కీలకపాత్రలలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆగస్ట్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కాగా..దాదాపు 6 నెలల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ జరగనుందని.. ఆ సమయంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?