Annamacharya: పాట వివాదంపై స్పందించిన శ్రావణ భార్గవి.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన అన్నమయ్య వంశీకులు
తన తప్పు ఏమీ లేదని శ్రావణ భార్గవి సమర్ధించుకుంది. ఇదే విషయంపై న్నమయ్య వంశీకులు మాట్లాడుతూ.. శ్రీవారిపై రచించిన సంకీర్తనలను అస్యభకరంగా చిత్రికరించిన ఆల్బమ్ ఒక ఎత్తు అయితే.. దానిపై శ్రావణభార్గవి స్పందన తమను మరింతగా భాదించిందని చెప్పారు.
Annamacharya: టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సంకీర్తనను ప్రైవేట్ ఆల్బమ్ లా చిత్రీకరించడంపై అన్నమయ్య వంశీకులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనను దుర్వినియోగం చేయడాన్ని తప్పు పడుతున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపై భక్తిశ్రద్దలతో అన్నమయ్య రచించిన సంకీర్తనలను శృంగారభరితంగా చూపడం పై అన్నమయ్య వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ భార్గవి చేసిన పని తమకు అత్యంత బాధను కలిగించిందని అన్నారు అన్నమయ్య వంశీకులు.
అయితే తన తప్పు ఏమీ లేదని శ్రావణ భార్గవి సమర్ధించుకుంది. ఇదే విషయంపై న్నమయ్య వంశీకులు మాట్లాడుతూ.. శ్రీవారిపై రచించిన సంకీర్తనలను అస్యభకరంగా చిత్రికరించిన ఆల్బమ్ ఒక ఎత్తు అయితే.. దానిపై శ్రావణభార్గవి స్పందన తమను మరింతగా భాదించిందని చెప్పారు. తాము ఈ విషయాన్నీ టిటిడి దృష్టికి తీసుకెళ్లనున్నామని.. అన్నమయ్య సంకీర్తనలను భక్తి భావంతో కాకుండా శృంగార భరితంగా చూపించే ప్రయత్నం జరగకుండా చొరవ చూపాలని తాము కోరనున్నామ ని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోనూ అన్నమయ్య కీర్తనలను వాడారని అయితే ఆ సినిమాలో అభ్యంతరకరంగా లేవని చెప్పారు.
సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రావణి భార్గవి అన్నమయ్య కీర్తనలను అవమానపరిచేలా చిత్రీకరించడం సరి కాదంటున్నారు అన్నమయ్య వంశీకులు. అభిషేక సేవలో స్వామి వారిని కీర్తించిన సంకీర్తన ను శ్రావణి భార్గవి తనకోసం అన్నట్లు కీర్తనను ఆలపించి ఆల్బమ్ చేయడంపై అభ్యం తరం వ్యక్తం చేసున్నారు. ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి కూడా తీసుకెళుతామని.. సోషల్ మీడియా నుంచి అభ్యంతరకరమైన ఆల్బమ్ ను తొలగించపోతే.. న్యాయ ప్రకారం ముందుకెళ్తామని అన్నమాచార్య వంశస్థులు హరి నారాయణచార్యుల చెప్పారు.
Reporter : Raju Tv9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..