Andhra Pradesh: కోనసీమ కొబ్బరి రైతుల కంట కన్నీరు.. వరదల కారణంగా అపార నష్టం..
Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వరద (Floods) చేసిన విలయతాండవానికి కొబ్బరి రైతులు విలవిలలాడుతున్నారు. వరదల కారణంగా ఒక పక్క ఆకలి కేకలు, సహాయక చర్యలు లేక ప్రజలు ఇబ్బందులు...
Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వరద (Floods) చేసిన విలయతాండవానికి కొబ్బరి రైతులు విలవిలలాడుతున్నారు. వరదల కారణంగా ఒక పక్క ఆకలి కేకలు, సహాయక చర్యలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరో పక్క కొబ్బరి పంట నీటిపాలై కన్నీరు పెడుతున్నారు రైతులు.. కాలం వరద రూపంలో చేసిన గాయాలతో కోనసీమ రైతులు రోదిస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక గ్రామంలో కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా కొబ్బరి పంట నేలరాలిపోవడంతో కోట్లల్లో నష్టం వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు వ్యాపారులు.
కొబ్బరి కాయలు పూర్తిగా తడిచిపోయి ఎగుమతికి పనికి రాకుండాపోయాయని 8 రూపాయల విలువ చేసే కొబ్బరికాయ 1 రూపాయి కూడా పలకడం లేదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చరిత్రలో ఎన్నడూ ఊహించని విధంగా జూలై నెలలో వరదల రావడంతో తీవ్ర నష్టాలు పాలయ్యామని రైతులు లబోదిపోమంటున్నారు. ఈ ఆకస్మిక వరదలు వల్ల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. లక్షల కొబ్బరికాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయని, అటు ఎగుమతి చేయడాని పనికి రాకుండా కుళ్లిపోయాయని కంట నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేయాలంటూ రైతులు అభ్యర్థిస్తున్నారు.
ఇక లంక గ్రామాల్లో వరదాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరద ముంచెత్తడంతో పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. లంక గ్రామల్లో దాదాపు వేల ఎకారాల్లో పంట నీటిలో మునిగిపోయింది. ఈ వరదల కారణంగా కోట్ల రూపాయిల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..