AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: బటన్‌ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి.. వైసీపీ ప్రభుత్వానికి జనసేనాని చురకలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వదర తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపునకు..

Pawan Kalyan: బటన్‌ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి.. వైసీపీ ప్రభుత్వానికి జనసేనాని చురకలు
Pawan Kalyan
Subhash Goud
|

Updated on: Jul 19, 2022 | 9:02 PM

Share

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వదర తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపునకు గురైన బాధితుల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో వందలాది గ్రామాలకు చెందిన ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రస్తుతం వరదలు తగ్గిపోయినా.. వారి కష్టాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వరదల కారణాల వేలాది మంది బాధితులు ఇబ్బదులకు గురవుతుంటే.. ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు నామ మాత్రంగానే ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వరదలపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను చూస్తుంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు. బటన్‌ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని అంటూ.. పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని, ఆహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చిన వారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందన్నారు. ప్రస్తుతం నీట మునిగిన ఇళ్లలోనే వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, సాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి
Janasena Pawan Kalyan

Janasena Pawan Kalyan

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి