Nithya Menen: పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్టార్ హీరోతో నిత్యా మీనన్ వివాహం ?..

తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది.

Nithya Menen: పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్టార్ హీరోతో నిత్యా మీనన్ వివాహం ?..
Nithya Menen
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 20, 2022 | 12:48 PM

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్యామీనన్ (Nithya Menon). అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం మెయిన్ హీరోయిన్‏గానే కాకుండా..సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె వివాహం జరగనుందట. స్నేహితుల ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని.. ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయని..త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని పలు వెబ్ సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు నిత్యా మీనన్ స్పందించలేదు. ఇక నిత్యా పెళ్లి వార్తలతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నిత్యా మీనన్ హదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ లో నటించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.