AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha – Naga Chaitanya: సామ్ చైతూ విడాకులపై స్పందించిన మురళి మోహన్.. ముందే తెలిసి ఉంటే మాట్లాడేవాడినంటూ..

వాళ్లిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. వాళ్లది చూడముచ్చటైన జంట అని.. అలాంటి వాళ్లిద్దరూ విడిపోయారని తెలిసి షాకయ్యానని చెప్పారు.

Samantha - Naga Chaitanya: సామ్ చైతూ విడాకులపై స్పందించిన మురళి మోహన్.. ముందే తెలిసి ఉంటే మాట్లాడేవాడినంటూ..
Murali Mohan
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2022 | 1:49 PM

Share

అక్కినేని నాగచైతన్య (NagaChaitanya), సమంత (Samantha) విడాకుల ప్రకటనతో అభిమానులతోపాటు సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం షాక్‏కు గురిచేసిందని.. ముందే తెలిస్తే మాట్లాడేవాడినన్నారు నటుడు మురళి మోహన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మురళి మోహన్ సమంత, నాగచైతన్య విడాకుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. వాళ్లది చూడముచ్చటైన జంట అని.. అలాంటి వాళ్లిద్దరూ విడిపోయారని తెలిసి షాకయ్యానని చెప్పారు.

మురళి మోహన్ మాట్లాడుతూ.. ” హైదరాబాద్‏లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‏లో ఇండిపెండెంట్స్ ఇళ్లు కట్టుకున్నాము. ఆ అపార్ట్‏మెంట్స్ భవనంపైన మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా మూడు ఇళ్లు నిర్మించాము. ఓసారి చైతూ వచ్చి ఆ ఇళ్లను చూశారు. అవి బాగా నచ్చడంతో తనకు ఒకటి కావాలని అడిగారు. దీంతో ఇవి అమ్మేవి కాదని.. ఇవ్వలేమని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత నాగార్జున వచ్చి అడిగారు. ఆయన మాట కాదనలేక ఆ మూడు ఇళ్లలో ఒకదాన్ని చైతన్యకు ఇచ్చేశాను. పెళ్ళి అయిన తర్వాత సామ్ చైతూ ఆ ఇంట్లోనే ఉన్నారు. రోజూ జిమ్‏లో కలిసే వర్కౌట్లు చేసేవారు. ఎప్పుడూ సరదాగానే కనిపించేవారు.

ఇవి కూడా చదవండి

వాళ్లు ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరిగిన సందర్భాలు లేవు. వీకెండ్ పార్టీ్స్, పార్టీలు కూడా ఏమి వాళ్లింట్లో జరగలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేంది వాళ్ల ఇల్లు. ఆ తర్వాత కొద్ది రోజులకు మా ఇంట్లో పనిచేసేవాళ్ళు వచ్చి సర్ సామ్ చై విడిపోయారు. చైతన్య సర్.. తన వస్తువులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయి హోటల్‏లో ఉంటున్నారు అని చెప్పడంతో నేను షాకయ్యాను. ఈ విషయం ముందే తెలిసి ఉంటే వాళ్లిద్దరితో మాట్లాడేవాడిని. లేదా నాగార్జునతో మాట్లాడేవాడిని ” అని చెప్పారు.

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?