Viral Video:టైమ్‌సేవ్‌ అవుతుందని.. క్రాసింగ్‌లోనే రైలు దిగిన ప్రయాణికులు.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్..

వైరల్‌ అవుతున్న వీడియోలో స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా

Viral Video:టైమ్‌సేవ్‌ అవుతుందని.. క్రాసింగ్‌లోనే రైలు దిగిన ప్రయాణికులు.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్..
Railway Tracks
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2022 | 3:32 PM

Viral Video: ప్రమాదాలు చెప్పి రావు. ఒక్కసారి రెడ్డెక్కితే.. గమ్యం చేరే వరకు ప్రాణాలకు గ్యారెంటీ లేదు. చాలా ప్రమాదాలు అత్యంత ఘోరంగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకోనివి జరుగుతుంటాయి. రెప్పపాటు కాలంలో ఊహించని ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి సంఘటనల్లో త్రుటిలో ప్రాణాపాయం తప్పుతోంది. తాజాగా అలాంటి షాకింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలానే ఓ కుటుంబం కొద్ది తేడాతో ప్రాణాలు దక్కించుకుంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే కిందకు దిగి పట్టాలు దాటబోయారు… అంతలోనే పక్క ట్రాక్ లో 80 కి.మీ స్పీడ్‌తో ఓ రైలు దూసుకు వస్తోంది. దీంతో వారికి ఏం చేయాలో తెలియలేదు. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. మిగిలినవారు కూడా ట్రాక్ పై అటు ఇటు పరిగెత్తుతూ చివరికి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనంత నిలిచిఉన్న రైలులో ఉన్న వ్యక్తులు కొందరు వీడియో తీశారు. ఐఎఫ్ఎస్‌ అధికారి సుశాంత్ నందా ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అయితే ఇందులో ప్రయాణికుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా, వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి పనులు మరెవరూ చెయ్యొద్దంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల కారణంగానే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, ఐదు,పదినిమిషాల సమయం ఆదా అవుతుందని ఆలోచించి ఏకంగా నూరేళ్ల జీవితం ముగిసి పోయేలా చేసుకోవద్దంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అందుకే రైలులో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి