Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు…22మంది మృతి

ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్టు అక్కడి...

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు...22మంది మృతి
Southern Egypt
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 9:33 PM

Road Accident: ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్టు అక్కడి అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. కైరోకు దక్షిణంగా 220 కి.మీ. దూరంలోని మలావి నగరంలో తెల్లవారు జామున ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

మిన్యా ప్రావిన్స్‌లోని మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈజిప్ట్‌లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ట్రాఫిక్‌ చట్టాలను సరిగా అమలు చేయపోకవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా. మరో 18 మంది గాయపడ్డారు. గతేడాది ఏప్రిల్ హైవేపై లారీని ఓవర్‌ టెక్‌ చేస్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి