Man – Goat: మేకపోతుతో మనిషి ఢీ అంటే ఢీ.. పోటాపోటీగా ఎదురుపడుతున్న మేక.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో
కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. చిన్నా పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ వర్కౌట్స్ చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివాళ్లు వాళ్లకు అందుబాటులో ఉన్న పరికరాలతో
కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. చిన్నా పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ వర్కౌట్స్ చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివాళ్లు వాళ్లకు అందుబాటులో ఉన్న పరికరాలతో కసరత్తులు చేస్తున్నారు. ఓ ఆఫ్రికన్ తన ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలో అతను ఓ మేకపోతుతో ఢీ కొడుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక పెద్ద బండపైన బలిష్టమైన ఓ మేకపోతు నిల్చుని ఉంది. కింద దాంతో తలపడే వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ సై అంటే సై అన్నట్టు పోటీకి సిద్ధమయ్యారు. ఒకరి నొకరు తలతో బలంగా కుస్తీ పడుతున్నారు. ఆ వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి మేకను ఢీకొడుతున్నాడు. మరోవైపు మేక కూడా తగ్గేదే లేదంటూ అంతే బలంగా అతన్ని ఎదుర్కొంటుంది. దాదాపు 20 సెకన్లు సమఉజ్జీగా తలపడిన తర్వాత మేక ఆ వ్యక్తిని నెట్టేసింది. ఈ అద్భుతమైనా వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మేక స్టామినా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..