Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Anil kumar poka

|

Updated on: Jul 16, 2022 | 6:35 PM

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫి జావేద్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు.


సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫి జావేద్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు. ‘బాదే భయ్యా కీ దుల్హనియా’ సీరియల్‌తో నటిగా పరిచయమైన ఉర్ఫి ‘మేరీ దుర్గా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో పాల్గొని ఉర్ఫి మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉర్ఫి లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంది.ముఖ్యంగా విభిన్నంగా ఉండే అవుట్‌ ఫిట్స్‌లో సోషల్ మీడియాను తనవైపు తిప్పుకునే ఉర్ఫి తాజాగా మరో వెరైటీ డ్రస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయానీ ఉర్ఫి వీడియోను పోస్ట్‌ చేశారు. ఉర్ఫి ధరించిన డ్రస్‌ పూర్తిగా బ్లేడ్స్‌తో తయారు చేశారు. ఇదిలా ఉంటే ఉర్ఫి గతంలో పోస్ట్‌ చేసిన కొన్ని అవుట్‌ ఫిట్స్‌కు నెటిజన్లు కాస్త వ్యతిరేకించిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ బ్లేడ్‌ డ్రస్‌పై మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. డ్రస్‌ వెరైటీగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా తన అవుట్‌ ఫిట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫి మరోసారి బ్లేడ్‌ డ్రస్‌తో అందరినీ అట్రాక్ట్‌ చేసింది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లైక్‌ల వర్షం కురిసింది. ఉర్ఫి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియోకు లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఇంట్రోవర్ట్స్‌ కోసమే ఈ డ్రస్‌ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిన ఈ బ్యూటీ.. ఇలాంటి క్రేజీ ఐడియాస్‌ తనకు ఇస్తోన్న తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 16, 2022 06:35 PM