ఎర్ర బస్సు అనుకుంటే పొరబడినట్లే గురూ.. అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే..

ఈ బస్సును చూసి ఎర్రబస్సు అని మీరనుకుంటే అది తప్పు. బయటి నుంచి ఇది కార్గొ బస్సులా కనిపిస్తున్న లోపల మాత్రం ఈ బస్సును చూసి ఔరా అనాల్సిందే. ఈ బస్‌లో..

ఎర్ర బస్సు అనుకుంటే పొరబడినట్లే గురూ.. అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే..
Space Bus
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 9:59 PM

సంగారెడ్డి జిల్లాలో స్పేస్ ఆన్ వీల్స్ బస్‌ వచ్చింది. ఈ బస్‌ ఖగోళశాస్త్రంపై అవగాహన, అంతరిక్ష విఙ్ఞానం కోసం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అసలు ఈ బస్‌లో ఏమేమున్నాయి. అసలు ఈ బస్‌ సంగారెడ్డికి ఎందుకు వచ్చింది.. ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ బస్సును చూసి ఎర్రబస్సు అని మీరనుకుంటే అది తప్పు. బయటి నుంచి ఇది కార్గొ బస్సులా కనిపిస్తున్న లోపల మాత్రం ఈ బస్సును చూసి ఔరా అనాల్సిందే. ఈ బస్‌లో రాకెట్లు, చంద్రాయాన్‌ ప్రయోగ డెమోలు, శాటిలైట్‌లు ఇవన్నీ ఈ బస్సులో కనిపిస్తాయి. అదేంటీ..అనుకుంటున్నారా.. ఇది స్పేస్‌ ఆన్ వీల్స్ బస్సు. ఇందులో ఇస్రో సాధించిన విజయాలతో పాటు..మన దేశం ఇప్పటివరుకు అంతరిక్షంలో ఎలాంటి ప్రయోగాలు చేసిందో మొత్తం వివరాలు ఈ బస్‌లో చూస్తే తెలుస్తాయి.

1980 కి ముందు భారత్ అంతరిక్షంలో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్న ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే 1980 జూలై18న భారతదేశ అంతరిక్ష చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసింది. SLV3 రాకెట్‌ను మొదటిసారి షార్‌ నుంచి అంతరిక్షంలోకి వదిలారు. ఈ ప్రయోగం విజయ వంతమైంది. ఇక అప్పటి నుంచి ప్రతి యేటా జూలై 18న స్పేస్ ఆన్‌ వీల్స్ అనే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ బస్సులో మొదట ప్రయోగించిన రాకెట్ నుంచి ఇప్పడు ప్రయోగించబోయే బాహుబలి రాకెట్ వరకు అన్ని వివరాలు డెమోలతో సహా ఈ బస్సులో ఉన్నాయి. అలాగే చంద్రయాన్ ప్రయోగం కూడా ఎలా జరిగింది అనే డెమో కూడా ఉంది. ఇవే కాక ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆ శాటిలైట్‌లు ఎలా పని చేస్తాయి అని డీటెయిల్స్ కూడా ఈ బస్సులో ఉన్నాయి. మానవ రహిత రాకెట్‌ నుంచి మానవ సహిత అంటే మనుషులు ప్రయాణించే రాకెట్లు ఎలా ఉంటాయి. అందులో మనుషులు ఎలా వెళ్తారు అని తెలియజేసేలా డెమోలు ఉన్నాయి.. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఈ స్పేస్ ఆన్ వీల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. విద్యార్థులకు అంతరిక్ష ప్రయోగాల వైపు మళ్లించేందుకు కూడా ఈ ప్రోగ్రాం సహాయపడు తుందన్నారు. శ్రీహరికోట వెళ్లి అంతరిక్ష ప్రయోగాలు చూడలేని వారు.. ఈ బస్సులో చూస్తే పూర్తి అహగాహన వస్తుంద న్నారు.ఈ విద్యా సంవతర్సరంలో తెలంగాణలో తొలిసారి సంగారెడ్డి జిల్లాకి ఈ బస్‌ వచ్చింది. మొదటగా ఈ బస్‌ను ఒక్క రోజే ఇక్కడ ఉంచాలనుకున్నా..విద్యార్థుల కోసం దీనిని రెండు రోజులు పొడగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి