Bank Jobs: పోచంపల్లి కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్‌ చేసిన వారు కూడా అర్హులు..

Bank Jobs: యాదాద్రి భునవగిరి జిల్లా పోచంపల్లిలోని పోచపల్లి కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను...

Bank Jobs: పోచంపల్లి కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్‌ చేసిన వారు కూడా అర్హులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 20, 2022 | 6:06 AM

Bank Jobs: యాదాద్రి భునవగిరి జిల్లా పోచంపల్లిలోని పోచపల్లి కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మేనేజర్ (04), అకౌంటెంట్స్/ అసిస్టెంట్‌ మేనేజర్లు (02), ఐటీ ప్రొఫెషనల్స్ (02), స్టాఫ్ అసిస్టెంట్లు/ జూనియర్ ఆఫీసర్లు (08) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30-06-2022 నాటికి 34 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* ముందు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌ను recruitment@pochampallybank.com మెయిల్‌ ఐడీకి పంపించాలి. లేదా దరఖాస్తును ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఇం.నెం.3-188, మెయిన్ రోడ్డు, ప్రధాన కార్యాలయం, పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

* అప్లికేషన్‌ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్, బ్యాంకింగ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలుటాయి.

* రిజిస్ట్రేషన్‌ నమోదు 20-07-2022న ప్రారంభమవుతుండగా చివరి తేదీగా 30-07-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..