NEET Exam Issue: ఢిల్లీకి చేరిన కేరళ నీట్ వివాదం.. అమ్మాయిల లో దుస్తులు విప్పించడంపై కేరళ ప్రభుత్వం..
NEET Exam Issue: కేరళలో తాజాగా జరిగిన నీట్ పరీక్ష నిర్వహణలో భాగంగా కళాశాల యాజమాన్యం విద్యార్థినుల లో దుస్తులు విప్పించినట్లు వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం...
NEET Exam Issue: కేరళలో తాజాగా జరిగిన నీట్ పరీక్ష నిర్వహణలో భాగంగా కళాశాల యాజమాన్యం విద్యార్థినుల లో దుస్తులు విప్పించినట్లు వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అంశం ఢిల్లీకి చేరనుంది. ఈ విషయమై కేరళ విద్యా శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా కేంద్ర హెచ్‌ఆర్ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. పరీక్ష నిర్వహణా మర్గదర్శకాలను మార్చాలని కేరళ ఎంపీ ఒకరు డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని తీర్మానం సైతం ప్రవేశ పెట్టారు. పరీక్షల సమయంలో జరిగే అవకతవకల నివారణకై.. ఇలాంటి అనాగరిక చర్యలకు బదులు టెక్నాలజీ వాడుకోవాలని.. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా చేయాలని కోరారు.
ఇదిలా ఉంటే కేరళ- కొల్లాం- ఆయుర్ లోని మార్దోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. ఆదివారం నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో.. మెటల్ బటన్స్ ఉన్నాయన్న ఆరోపణతో.. ఆడపిల్లల లోదుస్తులు విప్పించినట్టు ఫిర్యాదులొచ్చాయి. అయితే ఇవేవీ తమ దృష్టికి రాలేదని ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ) ప్రకటించింది. ఆడపిల్లల తల్లిదండ్రులన్నట్టు అలాంటి చర్యలేవీ తాము ప్రొత్సహించమనీ. ఇలాంటి ఘటనేదీ జరగలేని కొల్లాం జిల్లా పరీక్షల నిర్వహణాధికారులు స్పష్టం చేశారు.
ఇక కాలేజీ యాజమాన్యం విషయానికి వస్తే.. పరీక్షల నిర్వహణకు తగిన ఏజెన్సీలుంటాయనీ ఇందులో తమ ప్రమేయమేదీ ఉండదని తేల్చి చెప్పింది. అయితే ఈ ఘటన జరిగిందా లేదా అనే దానిపై కేరళ విద్యాశాఖ విచారణ చేసింది. కొందరు విద్యార్ధినులు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. లోదుస్తులున్న ఒక బాక్సు కాలేజీ సిబ్బంది బయట పడేసినట్టు తెలుస్తోంది. కొందరు విద్యార్దులకు తమకిలాంటి చేదు అనుభవం ఎదురైనట్టు చెప్పారు. లోదుస్తులు విప్పితే తప్ప పరీక్షలు రాసే అవకాశం లేదని నిర్వాహకులు తమతో అన్నట్టు వాపోయారు. అందుకే ఒక విద్యార్ధిని తండ్రి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. మరి ఈ అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..