Crime News: మేనత్త వివాహేతర బంధాన్ని కెమెరాలో బంధించి.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి.. కన్నింగ్ కపుల్ ఏం చేశారో తెలిస్తే..
Crime News: సొంత మేనత్తనే బ్లాక్ మెయిల్ చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది ఓ యువతి. బాయ్ ఫ్రెండ్‌తో పెద్ద స్కెచ్ వేసింది. కానీ ప్లాన్ కాస్త బెడిసి కొట్టడంతో..
Crime News: సొంత మేనత్తనే బ్లాక్ మెయిల్ చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది ఓ యువతి. బాయ్ ఫ్రెండ్‌తో పెద్ద స్కెచ్ వేసింది. కానీ ప్లాన్ కాస్త బెడిసి కొట్టడంతో మొదటికే మోసం వచ్చింది. ప్రస్తుతం జైలు ఊసలను లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బాగలూరుకు చెందిన ఓ 38 ఏళ్ల మహిళా, ఒక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఇద్దరు అడపాదడపా యలహంకలోని ఓ హోటల్‌లో కలిసేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు మహిళ మేనకొడలు ఉషా, తన స్నేహితుడు సురేశ్‌తో కలిసి హోటల్ గదిలో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ కెమెరాను ఉంచారు.
ఆ తర్వాత అసలు నాటకానికి తెర తీశారు. వారిద్దరూ సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసి సదరు బాధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. రూ. 25 లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయితే డబ్బులు చెల్లించేందుకు సదరు మహిళ నిరాకరించడంతో ఉషా కొత్త నాటకం ఆడింది. తన మొబైల్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి మీ వీడియో క్లిప్ పంపించారంటూ మరింత బెదిరింపులకు గురిచేసింది.
దీంతో విసిగిపోయిన సదరు మహిళ జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్లాక్ మెయిల్ చేస్తోంది మరెవరో కాదు బాధిత మహిళ మేనకోడలు ఉషానేనని గుర్తించారు. ఉషాను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. స్నేహితుడు సురేష్‌తో వీడియోను చిత్రీకరించినట్లు నేరాన్ని అంగీకరించడంతో సురేష్‌ను కూడా అదులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..