Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: ప్రెగ్నెన్సీ పుకార్లపై కరీనా అదిరిపోయే రియాక్షన్‌.. అది కేవలం పాస్తా, వైన్‌ వల్లేనంటూ..

బాలీవుడ్‌ అన్యోన్య దంపతుల్లో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan)- కరీనా కపూర్‌ (Kareena Kapoor) జోడీ కూడా ఒకటి. ఇద్దరి మధ్య సుమారు 13 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉన్నప్పటికీ ప్రేమ బంధంతో ఒక్కటయ్యారీ లవ్లీకపుల్‌. 2012 అక్టోబర్‌ 16న ముంబైలో పెద్దల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. తమ వైవాహిక బంధానికి

Kareena Kapoor: ప్రెగ్నెన్సీ పుకార్లపై కరీనా అదిరిపోయే రియాక్షన్‌.. అది కేవలం పాస్తా, వైన్‌ వల్లేనంటూ..
Kareena Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2022 | 2:49 PM

బాలీవుడ్‌ అన్యోన్య దంపతుల్లో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan)- కరీనా కపూర్‌ (Kareena Kapoor) జోడీ కూడా ఒకటి. ఇద్దరి మధ్య సుమారు 13 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉన్నప్పటికీ ప్రేమ బంధంతో ఒక్కటయ్యారీ లవ్లీకపుల్‌. 2012 అక్టోబర్‌ 16న ముంబైలో పెద్దల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఆతర్వాత తమ వైవాహిక బంధానికి గుర్తుగా తైమూర్ అలీ ఖాన్, జహంగీర్‌ అలీ ఖాన్ (జేహ్‌) ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే సైఫ్ ఇంతకుముందే అమృతా సింగ్ అనే సినిమా నటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన సైఫ్‌ ఆ తర్వాత కరీనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సైఫ్‌- కరీనా గురించి సోషల్‌ మీడియాలో ఓ క్రేజీ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. కరీనా మరోసారి ప్రెగ్నెంట్‌ అయిందని వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి.

సైఫ్ చాలా చేశాడు..

కాగా కరీనా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్‌లో ఉంది. తమ టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే ఇందుకు కారణం. దీంతో బాలీవుడ్‌ సీనియర్‌ నటి మళ్లీ గర్భం ధరించిందన్న పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా వీటిపై స్పందించిన కరీనా ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌తో సమాధానమిచ్చింది. ‘నా పొట్టలో ఉన్నది కేవలం పాస్తా, వైన్‌ మాత్రమే. ప్రశాంతంగా ఉండండి. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్‌ చెప్పాడు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అదేవిధంగా కరీనా ప్రెగ్నెంట్‌ రూమర్లకు చెక్‌ పడినట్లయింది. ఇదిలా ఉంటే కరీనా ప్రస్తుతం ఆమిర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆగస్ట్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది.

1

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..