IND Vs WI: విండీస్‌తో వన్డే పోరు.. గబ్బర్ ముంగిట అరుదైన రికార్డులు.. కోహ్లీని సైతం అధిగమించే ఛాన్స్
India VS West Indies 1st ODI: ఇంగ్లండ్‌ను వారిసొంతగడ్డపైనే ఓడించి విజయోత్సాహంలో ఉన్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఈరోజు ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి..
India VS West Indies 1st ODI: ఇంగ్లండ్‌ను వారిసొంతగడ్డపైనే ఓడించి విజయోత్సాహంలో ఉన్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఈరోజు ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈక్రమంలో వన్డే సిరీస్‌లో టీమిండియాకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సారథ్యం వహించనున్నాడు.ఈ సిరీస్‌లో అతను మరో యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. కాగా ఈ సిరీస్‌లో కెప్టెన్ గబ్బర్ ముందు కొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, యువరాజ్‌సింగ్ లాంటి దిగ్గజాలకు సైతం అందని కొన్ని అరుదైన ఘనతలను అందుకునే అవకాశం ఉంది. మరి అవేంటో చూద్దాం రండి.
కాగా ఈ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే టీమిండియా తరఫున వెస్టిండీస్ గడ్డపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధావన్ రికార్డు సృష్టించనున్నాడు. ఈ లిస్టులో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ అత్యధికంగా 15 మ్యాచ్‌లు ఆడి మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్, యువరాజ్ సింగ్, ధావన్ తలా 14 మ్యాచ్‌లు రెండో స్థానంలో ఉన్నారు. దీంతో శిఖర్ ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే మొత్తం 17 మ్యాచ్‌లతో అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు.
కోహ్లీ తర్వాత..
కాగా కరేబియన్ గడ్డపై అత్యధిక పరుగుల చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో కోహ్లీ(790) టాప్‌లో ఉన్నాడు. ధోనీ (458), యువరాజ్ (419), రోహిత్ (408) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ధావన్ (348) పరుగులతో ఉన్నాడు. అతను ఇంకో 110 కన్నా ఎక్కువ పరుగులు సాధిస్తే విరాట్ తర్వాతి స్థానానికి చేరుతాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..