Health Tips: ఈ లక్షణాలు స్ట్రోక్‌కు సంకేతం కావొచ్చు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Post Stroke Depression: గుండె సమస్యలు ఉన్నవారికి డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా కనిపించవచ్చు. అయితే కొందరిలో స్ట్రోక్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని సరికొత్త అధ్యయనంలో తేలింది.
Post Stroke Depression: గుండె సమస్యలు ఉన్నవారికి డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా కనిపించవచ్చు. అయితే కొందరిలో స్ట్రోక్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని సరికొత్త అధ్యయనంలో తేలింది. ‘స్ట్రోక్‌తో బాధపడుతున్న వ్యక్తులలో డిప్రెషన్ అనేది చాలా సాధారణ సమస్య. అయితే స్ట్రోక్ తర్వాతే డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే స్ట్రోక్ సంభవించడానికి ముందే చాలామందిలో డిప్రెషన్ లక్షణాలు బయటపడతాయి’ అని తమ అధ్యయనంలో తేలిందని జర్మనీలోని మన్స్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు మరియా బ్లోచ్ల్ తెలిపారు. సుమారు 65 ఏళ్ల వయస్సు ఉన్న 10,797 మందిని సుమారు 12 ఏళ్ల పాటు పరీక్షించి ఈ అధ్యయనం చేసినట్లు మరియా తెలిపారు. వీరిలో చాలామందికి ప్రారంభంలో ఎలాంటి గుండెపోటు సమస్యలు లేవు. అయితే అధ్యయనం సమయంలోనే సుమారు 425 మందికి గుండెపోటు సమస్యలు తలెత్తాయి. ఇదే సమయంలో సమాన వయసు, లింగం, జాతి తదితర ఆరోగ్య లక్షణాలున్న మరో 4, 249మందిని స్ట్రోక్ బాధితులతో పోల్చగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఒంటరితనం, నిద్రలేమి తదితర డిప్రెషన్ సమస్యలున్నప్పటికీ ఎలాంటి గుండెపోటు సమస్యలు తలెత్తలేదని ఈ పరిశోధనలో తేలింది.
స్ట్రోక్‌కు ముందే మానసిక సమస్యలు..
కాగా స్ట్రోక్ సమయానికి ఆరు సంవత్సరాల ముందు, తరువాత స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల స్కోర్లని పరిశీలించగా వారంతా దాదాపు 1.6 పాయింట్లతో సమానంగా ఉన్నారు . కానీ స్ట్రోక్‌కు దాదాపు రెండు సంవత్సరాల ముందు, గుండె సమస్యల బారిన పడిన వారి సంఖ్య సగటున 0.33 పాయింట్లు పెరగడం ప్రారంభమైంది. స్ట్రోక్ తర్వాత, డిప్రెసివ్ లక్షణాలు ఈ గ్రూప్‌కి అదనంగా 0.23 పాయింట్లు పెరిగాయి. మొత్తం మీద 2.1 పాయింట్‌లకు చేరాయి. అదేవిధంగా స్ట్రోక్ తర్వాత 10 సంవత్సరాల పాటు వారు అదే స్థాయిలోనే ఉన్నారు. దీనికి విరుద్ధంగా, స్ట్రోక్ లేని వ్యక్తుల స్కోర్‌లు అధ్యయనం అంతటా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ‘ స్ట్రోక్‌కు ముందు తలెత్తే డిప్రెషన్ లక్షణాలను పసిగట్టడం చాలా కష్టమవుతుంది. అయితే మానసిక సమస్యలు, తీవ్ర అలసట, నీరసం, స్ట్రోక్‌కు సంకేతాలు కావొచ్చు. ఎవరికి స్ట్రోక్ వస్తుందో అంచనా వేయడానికి ఈ ప్రీ-స్ట్రోక్ మార్పులను ఉపయోగించవచ్చా అనేది అస్పష్టంగా ఉంది. డిప్రెషన్ లక్షణాలు ఎందుకు సంభవిస్తాయో ఖచ్చితంగా భవిష్యత్తు పరిశోధనల్లో ప్రీ-స్ట్రోక్‌ను పరిశోధించాల్సిన అవసరం ఉంది. అలాగే, డిప్రెషన్ లక్షణాల కోసం వైద్యులు ఎందుకు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. స్ట్రోక్స్ ఉన్న వ్యక్తులలో డిప్రెషన్ దీర్ఘకాలికంగా ఉంటుంది’ అని మరియా పేర్కొన్నారు. అయితే ఈ అధ్యయనంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. డిప్రెషన్‌కు సంబంధించిన చికిత్సలపై పరిశోధకుల దగ్గర తగినంత డేటా లేదని ఆమె తెలిపారు. (Source)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..