AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abortions: బలవంతపు అబార్షన్లు శిశు మరణాలకు కారణమవుతున్నాయి.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ఇండియాలో (India) ముందస్తు జననాలు, శిశు మరణాలకు అబార్షన్లు కారణమవుతున్నాయని ఓసర్వేలో వెల్లడైంది. కుటుంబ నియంత్రణకు అబార్షన్‌ను ఉపయోగించడం వల్ల 62% ముందస్తు జననాలు, శిశు మరణాలు పెరగుతున్నాయని తెలిపింది. ప్రపంచ....

Abortions: బలవంతపు అబార్షన్లు శిశు మరణాలకు కారణమవుతున్నాయి.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Abortions
Ganesh Mudavath
|

Updated on: Jul 22, 2022 | 1:47 PM

Share

ఇండియాలో (India) ముందస్తు జననాలు, శిశు మరణాలకు అబార్షన్లు కారణమవుతున్నాయని ఓసర్వేలో వెల్లడైంది. కుటుంబ నియంత్రణకు అబార్షన్‌ను ఉపయోగించడం వల్ల 62% ముందస్తు జననాలు, శిశు మరణాలు పెరగుతున్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 73 మిలియన్ల గర్భస్రావాలు జరుగుతున్నాయని వివరించింది. భారతదేశంలో అబార్షన్ రేటు 15-49 సంవత్సరాల వయస్సు గల వెయ్యి మంది మహిళలకు 49 గా ఉందని అంచనా వేసింది. బలవంతపు అబార్షన్లు ముందస్తు జనన ప్రమాదాన్ని 25 – 27 శాతం పెంచుతుందని తేలింది. పలు కారణాల వల్ల మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొంది. కుటుంబ నియంత్రణకు పట్టణ మహిళలు సురక్షిత చర్యలు చేపడుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రం కుటుంబ నియంత్రణ పేరుతో గర్భస్రావానికి పాల్పడతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. WHO ప్రతి దేశ అబార్షన్ చట్టాలు, విధానాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అబార్షన్ కు సంబంధించిన గణాంకాలను సేకరించి పదిలపరిచింది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం రష్యాలో అబార్షన్ రేటు 53.7, వియత్నాం 35.2, కజకిస్థాన్ 35 తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మెక్సికోలో అత్యల్ప అబార్షన్ రేటు 0.1 గా ఉంది. మెక్సికో తర్వాతి స్థానంలో పోర్చుగల్ 0.2తో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారతదేశంలో అబార్షన్ రేటు 15-49 సంవత్సరాల వయస్సు గల 1,000 మంది మహిళలకు 49 అబార్షన్‌లు అని ఒక అధ్యయనం అంచనా వేసింది. అంటే 16 మిలియన్ల అబార్షన్‌లు. ముంబయిలోని వోకార్డ్ హాస్పిటల్‌లోని ప్రసూతి, గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ గాంధాలీ దేవురుఖ్కర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంతగా పట్టణ ప్రాంతాల్లో గర్భనిరోధకం లాగా గర్భస్రావం చేయడం సాధారణమైన ప్రక్రియ కాదన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కాన్సెప్ట్ ఆప్షన్‌ల గురించి అవగాహన ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళకు అవేవీ తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మహిళలకు గర్భనిరోధక పద్ధుతులు, గైనకాలజిస్టులు అందుబాటులోకి లేకోపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

బలవంతపు అబార్షన్లు తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీస్తాయి. తీవ్ర రక్తస్రావం జరిగి, భవిష్యత్తులో రక్తహీనతకు దారితీసే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇది ఇతర ప్రాణాంతక వ్యాధులకు గురిచేయవచ్చు. గర్భిణీ స్త్రీలలో అసురక్షిత అబార్షన్ మరణానికి ప్రధాన కారణంగా మారుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అసురక్షిత అబార్షన్ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. భారతదేశంలో అతి తక్కువ సంఖ్యలో గర్భనిరోధక పద్ధతులు ఉన్నాయి. ప్రపంచం వినియోగిస్తున్న సాంకేతికతను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.

ఇవి కూడా చదవండి

పదేపదే గర్భం దాల్చడం వల్ల రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. భారతదేశంలో శిశు మరణాలు పెరగడానికి ఈ అబార్షన్‌లు ప్రధాన కారణం అనే అంశంపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శిశు మరణాల రేటును ప్రస్తుతం ఉన్న 2 శాతం (ప్రతి 1000 మందికి 20 మంది) నుంచి సింగిల్ డిజిట్‌కు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..