Telugu News Trending A video of an Indo Korean mother teaching her child Hindi lessons has gone viral on social media
Viral Video: కుమారుడికి హిందీ పదాలు నేర్పిస్తున్న కొరియన్ మమ్మీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు. మన దేశ పద్ధతులు, ఆచారాలు చూసి విదేశీయులూ ముచ్చటపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇండియాకు చెందిన వారు విదేశీయులను పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండియన్...
సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు. మన దేశ పద్ధతులు, ఆచారాలు చూసి విదేశీయులూ ముచ్చటపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇండియాకు చెందిన వారు విదేశీయులను పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఓ కొరియన్ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహిళ.. తన కుమారుడికి హిందీ నేర్పిస్తుంది. ఈమెకు భారతీయ సంస్కృతి అన్నా, భాష అన్నా ఎంతో అభిమానం. అందుకే తను ఒక ఇండియన్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు తన బాబుకు భారతీయ భాషలోనే పదాలు, అక్షరాలు నేర్పుతోంది. అంతే కాకుండా ఈమె చేసే వంటకు సంబంధించిన వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ తల్లీ కొడుకుల టీచింగ్ వీడియో నెట్టింట దూసుకోపోతోంది. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తున్నారు. వీరిద్దరూ ఇండియన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.