గణేష్ విగ్రహాలు తయారు చేసే వారికి గుడ్‌న్యూస్..! నిమజ్జనలపై హైకోర్టు కీలక ఆదేశాలు
అయితే, గతేడాది దీనికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీ చేశాయి. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
అన్ని పండగల్లో కెల్లా వినాయక చవితి ఎంతో విశిష్టమైనది.. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు భక్తులు. ఊరూరా, వాడవాడల విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాధులు భక్తులను ఆశ్వీరదిస్తారు. పల్లె,పట్నం అనే తేడా లేకుండా బొజ్జగణపయ్యల ప్రతిమలు శోభాయమానంగా దర్శనమిస్తుంటాయి. అలాంటి వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. అంతేకాకుండా వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర పీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ తిరస్కరించింది.
అయితే, గతేడాది దీనికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీ చేశాయి. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వినాయక విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లో నదులు, చెరువులు ఎక్కువగా లేనందున సమస్య తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి