AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పడ‌వ ప్ర‌మాదం.. న‌దిలో ప‌డిపోయిన న‌లుగురు కీల‌క నేత‌లు

మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లి వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో

AP News: చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పడ‌వ ప్ర‌మాదం.. న‌దిలో ప‌డిపోయిన న‌లుగురు కీల‌క నేత‌లు
Chandrababu
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2022 | 7:12 PM

Share

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా నీటిలో అకస్మత్తుగా అందరూ నీటిలో పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు సహా అందరూ నీటిలో తడిసి ముద్దాయ్యారు. కానీ, పెను ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లి వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో టీడీపీ సీనియ‌ర్ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ‌తో పాటు పార్టీకి చెందిన మ‌రో నేత స‌త్య‌నారాయ‌ణ గోదావ‌రి న‌దిలో ప‌డిపోయారు. అయితే చంద్రబాబు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

ఈ ప్ర‌మాదంపై త‌క్ష‌ణ‌మే స్పందించిన మ‌త్స్య‌కారులు టీడీపీ నేత‌ల‌ను న‌దిలో నుంచి సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోంప‌ల్లి చేరుకున్న సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న రెండు ప‌డ‌వ‌లు ప‌ర‌స్ప‌రం ఢీకొన్నాయి. దీంతో ఓ వైపున‌కు ఒరిగిపోయిన ప‌డ‌వ‌లో ఉన్న టీడీపీ నేత‌లు గోదావ‌రిలో ప‌డిపోయారు. అయితే మ‌త్స్య‌కారులు వేగంగా స్పందించ‌డంతో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. న‌దిలో ప‌డిన టీడీపీ నేత‌ల‌ను మ‌త్స్య‌కారులు బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చేరి హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..