Health: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే ఇదే మరీ.. పొట్టుతో కూడా పుట్టెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

ముందుగా ఉల్లిపాయ(ఉల్లిగడ్డ) గురించి ఓ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.. అదేంటంటే.. జూన్‌ 27 ఉల్లిగడ్డ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అనేక ప్రయోజనాలు కలిగిన ఉల్లి పొట్టులో విటమిన్..

Health: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే ఇదే మరీ.. పొట్టుతో కూడా పుట్టెడు ఆరోగ్య ప్రయోజనాలు..!
Onion Peel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 21, 2022 | 5:00 PM

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అయితే, ఇది కేవలం సామెత మాత్రమే కాదండోయ్‌..నిజంగానే ఉల్లి ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే అనేకం చూశాం.. అయితే, ఇప్పుడు ఉల్లిపొట్టుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే మీరు అస్సలు నమ్మరు..కానీ, ఇది నిజం.. ఉల్లిపొట్టుతో కలిగే లాభాలు తెలిస్తే.. ఇకమీదట దాన్ని పారేయకుండా దాచిపెట్టుకుంటారు..ఎందుకంటే.. ఉల్లిపొట్టులో ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

అయితే, ముందుగా ఉల్లిపాయ(ఉల్లిగడ్డ) గురించి ఓ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.. అదేంటంటే.. జూన్‌ 27 ఉల్లిగడ్డ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అనేక ప్రయోజనాలు కలిగిన ఉల్లి పొట్టులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఉల్లిపాయ పొట్టులో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి మంచివిగా చెబుతున్నారు. ఉల్లిపాయ పొట్టుతో టీ చేసుకుని తాగినట్టయితే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే.. ఉల్లిపాయ పొట్టుతో చేసిన టీని క్రమం తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు. ఇది ఒక హెర్బల్ టీ లాగా పనిచేసి, శరీరంలోని కేలరీలు కరుగుతాయి. దాంతో క్రమంగా బరువు తగ్గుతారు.

ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కూడా ఉల్లిగడ్డ పొట్టుతో చేసిన టీని తీసుకోవచ్చు. ఉల్లి పొట్టులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, కాబట్టి మీరు చర్మంపై దురద లేదా దద్దుర్లు ఏర్పడినపుడు ఈ హీలింగ్ డ్రింక్‌ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ పొట్టులో విటమిన్ సి అధికంగా ఉండటంతో ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఉల్లిపొట్టులో పలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల కండరాల నొప్పితో ఇబ్బంది పడేవారికి ఉపశమనం కలుగుతుందంటున్నారు. దీని కషాయం తీసుకున్నట్టయితే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇంకా ఇందులో ఉండే డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపును శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రకంగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?