ఇది మరో షాకింగ్ న్యూస్.. విమానం అద్దం పగలడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎక్కడంటే…
మరోవైపు ఇంజిన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం రెండు గో ఫస్ట్ విమానాలు నిలిచిపోయాయి. G8-386 ముంబై-లేహ్ విమానాన్ని ఢిల్లీకి, G8-6202 శ్రీనగర్-ఢిల్లీ విమానాన్ని శ్రీనగర్‌కు దారి మళ్లించారు. .
Windshield: విమానం గాల్లో ఉండగానే దాని విండ్ షీల్ట్ (అద్దం) పగిలిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలుపరిశీలించగా.. ఢిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్ విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్ట్ పగలిపోయింది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన G8151 విమానం ఢిల్లీ నుంచి గౌహతి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 2.55 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అద్దం పగిలి కనిపించడంతో..అత్యవసరంగా ఆ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
కాగా, ఆ విమానం గాలిలో ఉండగా దాని విండ్ షీల్డ్ పగుళ్లిచ్చింది. అయితే ఆ విమానం ఢిల్లీకి తిరిగి రాలేదు. దీనికి బదులుగా జాగ్రత్త చర్యల్లో భాగంగా జైపూర్ విమానాశ్రయానికి దానిని మళ్లించారు. మరోవైపు ఇంజిన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం రెండు గో ఫస్ట్ విమానాలు నిలిచిపోయాయి. G8-386 ముంబై-లేహ్ విమానాన్ని ఢిల్లీకి, G8-6202 శ్రీనగర్-ఢిల్లీ విమానాన్ని శ్రీనగర్‌కు దారి మళ్లించారు. తమ అనుమతి లేకుండా ఆ విమానాలను నడపవద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఆ రెండు విమానాలను నిలిపివేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.