Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. దెబ్బకు మరో రూట్‌లో..

Leh Airport: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి

Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. దెబ్బకు మరో రూట్‌లో..
Plane
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2022 | 9:26 PM

Leh Airport: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు, గమ్యస్థానానికి చేరాల్సిన విమానాలు వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవడానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే లేహ్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన సంఘటన కాస్త డిఫరెంట్ అని చెప్పారు. గాల్లోకి ఎగిరిన విమానాన్ని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవకుండా చేసింది ఓ కుక్క.

వివరాల్లోకెళితే.. మంగళవారం నాడు అంటే జులై19న ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. అదే సమయంలో రన్‌వేపైకి ఓ కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ అధికారులు విమానాన్ని టేకాఫ్ చేయడానికి నిరాకరించారు. ఆ కుక్క ఎంతకీ వెళ్లకోపోవడంతో.. దిశను మార్చుకుని ఎగిరిపోయింది. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారులు ధృవీకరించారు. అయితే, దీనిని రొటీన్ ఇన్సిడెంట్‌గా పరిగణించారు అధికారులు.

ఈ ఘటన ఇలా ఉంటే.. ఎయిర్ క్రాప్ట్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో చాలా ప్రమాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న ఏయిరిండియా విమానంలోని కాక్‌పిట్‌లో పిచ్చుక హల్‌చల్ చేసింది. 37000 అడుగుల ఎత్తుకు వెళ్లాక ఆ పిచ్చుక కనిపించడంతో విమాన సిబ్బందితో పాటు.. ఏవియేషన్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై డీజీసీఏ అధికారులు విచారణ చేపట్టారు. ఇలా వరుస ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..