Skin Care: ముఖానికి, ఒంటికి ఒకటే సబ్బువాడుతున్నారా.. అయితే, అది ఎంత ప్రమాదమో తెలుసా..?

చ‌ర్మం మృదువుగా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. ముఖంపై ఎటువంటి మ‌చ్చ‌లు , పింపుల్స్ లేకుండా అందంగా మార్చుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం పెరిగిపోయిన కాలుష్యం కారణంగా చాలా మంది అనేక రకాలైన చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. తరచూ చ‌ర్మం జిడ్డుగా మారిపోతుండడంతో ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు.. ఇలాంటి స‌మస్య ల నుంచి బ‌యిట ప‌డేందుకు చాలా మంది రకరకాల సబ్బులు, క్రీములు, మాశ్చరైజర్స్‌ వాడుతుంటారు. అవన్నీ మ‌న చ‌ర్మాన్ని ఆరోగ్యక‌రంగా ఉంచ‌డంతో […]

Skin Care: ముఖానికి, ఒంటికి ఒకటే సబ్బువాడుతున్నారా.. అయితే, అది ఎంత ప్రమాదమో తెలుసా..?
Skin Care
Follow us

|

Updated on: Jul 20, 2022 | 8:01 PM

చ‌ర్మం మృదువుగా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. ముఖంపై ఎటువంటి మ‌చ్చ‌లు , పింపుల్స్ లేకుండా అందంగా మార్చుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం పెరిగిపోయిన కాలుష్యం కారణంగా చాలా మంది అనేక రకాలైన చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. తరచూ చ‌ర్మం జిడ్డుగా మారిపోతుండడంతో ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు.. ఇలాంటి స‌మస్య ల నుంచి బ‌యిట ప‌డేందుకు చాలా మంది రకరకాల సబ్బులు, క్రీములు, మాశ్చరైజర్స్‌ వాడుతుంటారు. అవన్నీ మ‌న చ‌ర్మాన్ని ఆరోగ్యక‌రంగా ఉంచ‌డంతో పాటు తెల్ల‌గా మారుస్తాయని నమ్మకం. అయితే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొవాల్సింది సబ్బుల గురించి.. అందం, మృదుత్వం కోసం అనేకమంది విభిన్న సబ్బులను వాడుతుంటారు. అయితే, మన శరీరానికి సూట్ అయ్యే సబ్బు.. ముఖానికి సరిపోదట. ఈ రెండింటి అవసరాలు వేర్వేరుగా ఉంటాయట. అందుకే.. మనం ముఖ సంరక్షణకు సబ్బు వాడకూడదట. ముఖంపై సబ్బును ఉపయోగించడం వల్ల పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయంటున్నారు నిపుణులు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్కిన్‌కేర్ బ్రాండ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో చాలా వరకు పూర్తిగా ముఖం కోసం తయారు చేసిన సబ్బులే ఎక్కువగా మార్కెట్‌ అవుతున్నాయి. అలాంటి సోప్స్‌లో హైపోఅలెర్జెనిక్, సువాసన లేని , చర్మాన్ని తేమగా ఉండే వాటిని మాత్రమే ముఖ సంరక్షణ కోసం ఉపయోగించాలంటున్నారు నిపుణులు. ముఖానికి వాడే సబ్బులు ప్రత్యేకంగా సిరామైడ్‌లు, నియాసినామైడ్, గ్లిసరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఇవన్నీ మన ముఖ చర్మానికి సురక్షితంగా ఉంచుతాయి. పైగా కాంతివంతంగా, అందంగా చేస్తాయి. అలా కాకుండా.. శరీరానికి, ముఖానికి ఒకే రకం సోప్ వాడటం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సబ్బు బిళ్లని నేరుగా ముఖంపై రుద్దడం వల్ల కఠినంగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై గీతలు లాంటివి పడే అవకాశం ఉంది. చర్మానికి చిరాకు కూడా కలిగిస్తాయి. సబ్బులు చర్మాన్ని పొడిగా చేస్తాయి. అవి రసాయనాలతో నిండిఉండటం వల్ల సబ్బులు చర్మం నుండి తేమను తొలగించి పొడి చర్మం ఏర్పడేలా చేస్తాయి. సువాసన వచ్చేందుకు రసాయనాలు, ఆకర్షణీయంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు సబ్బుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి మీ సున్నితమైన ముఖ చర్మాన్ని చికాకుపరుస్తాయి. ఇది మొటిమలు, దీర్ఘకాలంలో ముడతలు రావడానికి కారణమవుతాయి.

ఇవి కూడా చదవండి

చాలా సబ్బులలో pH లెవల్స్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి మీ శరీరంలోని మురికిని కడగడానికి తయారు చేయబడ్డాయి. కాబట్టి, వాటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. మీ చర్మ రకాన్ని బట్టి మీ చర్మ సంరక్షణ కోసం రూపొందించిన వాటిని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. మాయిశ్చరైజర్‌లతో నిండిన రసాయన రహిత ఉత్పత్తుల ను ఎంచుకోవడం మంచిది. సాలిసిలిక్ యాసిడ్ వంటి మొటిమలను చంపే పదార్థాలను కలిగి ఉన్నవాటిని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. స్కిన్‌ కేర్‌లో భాగంగా క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ , మాయిశ్చరైజింగ్ ఉంటాయి. మీ చర్మ రకాన్ని బట్టి మీరు ఎంచుకోగల వివిధ రకాల క్లెన్సర్‌లు ఉన్నాయి.

జెల్ క్లెన్సర్స్: జిడ్డు చర్మం కలిగిన వారు కొనుగోలు చేసే క్లీనర్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు జెల్ క్లెన్సర్లను ఎంచుకోవాలి. జెల్ క్లెన్సర్లు కూడా రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తాయి. అదనపు నూనెను తొలగిస్తాయి.

క్లే క్లీనర్లు: క్లే క్లెన్సర్లు మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇవి అదనపు నూనెను గ్రహించి మొటిమలను పొడిగా చేసి, చర్మాన్ని క్లియర్‌గా మారుస్తాయి.

క్రీమ్ క్లెన్సర్‌లు: క్రీమ్ క్లెన్సర్‌లు ముఖం చర్మంపై అవసరమైన మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. డ్రై స్కిన్ ఉన్న వారికి ఇవి బాగా సహాయం చేస్తాయి.

ఫోమ్ క్లీనర్లు: ఫోమ్ క్లీనర్లు నూనె , ధూళిని తొలగించడానికి మంచి మొత్తంలో నురుగును ఉత్పత్తి చేస్తాయి. ఫోమ్ క్లీనర్లు జిడ్డు, నార్మల్ చర్మం కోసం ఉత్తమంగా ఉపయోగిస్తారు.

ఆయిల్ క్లెన్సర్‌లు: ఆయిల్ క్లెన్సర్‌లు బ్లాక్‌హెడ్స్ , వైట్‌హెడ్స్‌కు కారణమయ్యే రంధ్రాలను అన్‌లాగ్ చేస్తాయి.చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా,హైడ్రేట్‌గా మార్చుతాయి.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ