Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Latest research: మనుషులను చూడగానే నిప్పుకోడిలో సెక్స్ కోరిక పెరుగుతుందట..! శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్..

ఈ వాస్తవం ఇప్పుడు పరిశోధనలో నిర్ధారించబడి ఉండవచ్చు, కానీ, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా నిప్పుకోళ్లను పెంచుతున్న రైతులకు ఈ విషయం ముందే తెలిసి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉష్ట్రపక్షికి సంబంధించిన ఈ కొత్త సమాచారం

Latest research: మనుషులను చూడగానే నిప్పుకోడిలో సెక్స్ కోరిక పెరుగుతుందట..! శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్..
Ostriches
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2022 | 5:43 PM

Ostriches:నిప్పుకోడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షి. ఇది గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయడం ద్వారా 3 నుంచి 5 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది ఎంతో వేగంగా నడుస్తుంది. సగటున గంటలో 75 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. ఇది అత్యంత ఎత్తైన, బరువైన పక్షి. మగ నిప్పుకోడి పొడవు 9 అడుగుల వరకు ఉంటుంది. ఆడ నిప్పుకోడి 6 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. ఇది మొక్కలు, కీటకాలు, చిన్న జీవులను మాత్రమే తింటుంది. ఇది ఎక్కువ ఎత్తుకు ఎగరకపోవచ్చు కానీ దిశను మార్చుకోవడానికి రెక్కలను ఉపయోగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్షుల పాదాలకు సాధారణంగా మూడు లేదా నాలుగు వేళ్లు ఉంటాయి. కానీ నిప్పుకోడికి 2 మాత్రమే ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జంతువులలో కెల్లా నిప్పుకోడికి పెద్ద కళ్ళు ఉంటాయి. నిప్పుకోడి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే అది దాని కాళ్ళను ఉపయోగించి ఒక్క దెబ్బలో మనిషిని చంపగలదు. అలాంటి నిప్పుకోడికి సంబంధించి శాస్త్రవేత్తలు షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం,.. ఈ ఉష్ట్రపక్షి మనుషులను చూస్తే వారిలో సెక్స్ చేయాలనే కోరిక బలంగా ఉంటుందట. ఈ మేరకు 1990లలోనే ఈ విషయం వెల్లడైంది. ఆ సమయంలో పశుపోషణ చేసే ఒక రైతు ఉష్ట్రపక్షిలో ఈ మార్పును నిశితంగా గమనించాడు. మానవులు ఉష్ట్రపక్షి చుట్టూ నివసించినప్పుడల్లా, వారి లైంగిక ప్రవర్తన మారుతుందని కనుగొనబడింది. అవి తమ రెక్కలను మనుషుల ముందు ఎక్కువగా తిప్పుతుంటాయట. సిట్-అప్స్ చేస్తూ..తన మెడను ఊపుతూ.. ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని చేస్తాయట. దీనిని మేటింగ్ డ్యాన్స్ అంటారు.

ఉష్ట్రపక్షిపై వెల్లడైన ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. పరిశోధన కోసం, ఆస్ట్రిచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇంగ్లాండ్‌లో అలాంటి రెండు పొలాలు ఎంపిక చేశారు. IFL సైన్స్ నివేదిక ప్రకారం , పరిశోధకులు దీనిని అర్థం చేసుకోవడానికి రెండు పరిశోధనలు చేశారు. రెండేళ్లపాటు వీరి పరిశోధన సాగింది. మొదటి పరిశోధనలో మానవులు ఉష్ట్రపక్షిని దగ్గరగా, రెండవదానిలో దూరంగా ఉంచారు. బ్రిటిష్ పౌల్ట్రీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం, మానవులు ఉష్ట్రపక్షి వద్దకు వెళ్లినప్పుడు వారి కదలికలు మారిపోయాయి. ఉదాహరణకు, మనుషులను సమీపిస్తున్నప్పుడు, ఆడ ఉష్ట్రపక్షి సెక్స్ కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ కనిపించింది. ఆడ ఉష్ట్రపక్షి యొక్క ఈ ప్రవర్తన రెండేళ్లపాటు కొనసాగింది. అయితే, కొన్ని ఆడ ఉష్ట్రపక్షి అలా చేయలేదు. అదే సమయంలో, అవి మనుషులు లేనప్పుడు మామూలుగానే కనిపించిదట. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం బ్రిటన్‌లోని 68 శాతం ఆస్ట్రిచ్‌ల లైంగిక కోరిక మనుషులను చూసినప్పుడే రెట్టింపు అయినట్టుగా తేలింది. ఇది ముఖ్యంగా యవ్వనంలో ఉన్న ఉష్ట్రపక్షిలో కనిపించింది.

ఈ వాస్తవం ఇప్పుడు పరిశోధనలో నిర్ధారించబడి ఉండవచ్చు, కానీ, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా నిప్పుకోళ్లను పెంచుతున్న రైతులకు ఈ విషయం ముందే తెలిసి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉష్ట్రపక్షికి సంబంధించిన ఈ కొత్త సమాచారం వాటి పెంపకం దారులు, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి