Rishi Sunak: రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కాబోతున్నారా..? ‘డిషీ రిషి’ గురించి ఆసక్తికర విషయాలు..
Rishi Sunak – UK PM Race: కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్ పోల్‌లో వరుసగా నాలుగు రౌండ్లలోనూ రిషి సునాక్ ముందంజలో నిలిచారు. దీంతో రేసులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు.
Rishi Sunak – UK PM Race: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్ పోల్‌లో వరుసగా నాలుగు రౌండ్లలోనూ రిషి సునాక్ ముందంజలో నిలిచారు. దీంతో రేసులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగో రౌండ్లో 118 ఓట్లతో రిషి సునాక్ అగ్రస్థానంలో నిలవగా.. బిజినెస్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్‌కు 92, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్‌కు 86 ఓట్లు వచ్చాయి. తదుపరి రౌండ్‌లో సునక్, పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది. ఆ తర్వాత ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగలనున్నారు. దీని తర్వాత టోరీ పార్టీ సభ్యత్వం ఉన్న వారు చెందిన ఓటు వేయనున్నారు. సుమారు 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.
రిషి సునాక్ గురించి ఆసక్తికర విషయాలు..
- రిషి సునాక్ భారత సంతతికి చెందిన నాయకుడు..
- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్
- నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని 2009లో రిషి సునాక్ పెళ్లాడారు.
- ప్రజలు రిషి సునాక్ ను ‘డిషీ రిషి’ అని పిలుచుకుంటారు
- కరోనా మహమ్మారి కాలంలో రిషి సునాక్ రూపొందించిన ఆర్థిక విధానాలతో ఆయనకు ప్రజాదరణ పెరిగింది
- రిషి పూర్వీకులు పంజాబ్‌కు చెందినవారు
- భారత మూలాలున్న రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినవారు
- తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాకు వలసవెళ్లిన రిషి గ్రాండ్ పేరెంట్స్
- రిషి గ్రాండ్ పేరెంట్స్ తమ పిల్లలతో 1960లో తూర్పు ఆఫ్రికా కు నుంచి యూకే కు వెళ్లి స్థిరపడ్డారు
- రిషి తండ్రి యశ్ వీర్ కెన్యాలో జన్మించారు
- రిషి తల్లి ఉష టాంజానియాకు చెందిన మహిళ
- వీరిద్దరికి 1980లో మే 12న వీరికి జన్మించిన రిషి సునక్
- 2006లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి
- తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేసిన రిషి సునాక్
రాజకీయ ఆరంగ్రేటం..
- 2015లో ఎంపీగా ఎన్నికైన రిషి సునాక్
- అనంతరం పర్యావరణ, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన రిషి సునాక్
- ఎంపీకాకముందు నల్లజాతి, మైనారిటిల రీసెర్చి యూనిట్ కు అధిపతిగా పనిచేసిన రిషి సునాక్
- 2017 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన రిషి సునాక్
- అనంతరం రెండోసారి మంత్రిగా పనిచేసిన రిషి
- 2019 కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికల్లో బోరిస్ కు మద్దతిచ్చిన రిషి సునాక్
- 2019 జులైలో ట్రెజరీకి చీఫ్ సెక్రెటరీగా నియమింపబడ్డ సునాక్
- అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపీగా మూడోసారి గెలిచిన సునాక్
- 2020లో కీలకమైన సీనియర్ మంత్రి పదవిగా పిలువబడే ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ గా(ఆర్థిక మంత్రి) బాధ్యతలు చేపట్టిన సునాక్
- బ్రిటిష్ రాణి ట్రెజరీకి ఎగ్జిక్యూటివ్ అధికారిగా కొనసాగిన రిషి సునాక్
- బోరిస్ జాన్సన్ కు సన్నిహితుడు, అనుయూయుడిగా పేరుపొందిన రిషి సునాక్
- కరోనా సమయంలో రిషి సునాక్ రూపొందించిన విధానాలు ప్రజల ఆదరణ పొందాయి
- అదే సమయంలో విపక్ష నేతలనుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్న రిషి సునాక్
- ఈ నేపథ్యంలో మీడియా వేదికంగా విమర్శలను ఎదుర్కొన్న రిషి సునాక్ తో పాటు భార్య అక్షతా
- ‘రాణి కంటే ధనవంతులు: యూకే ఆర్థిక మంత్రి సంపద కేంద్రం అక్షతా మూర్తిని కలవండి’ అన్న హెడింగ్ తో పేపర్లలో వార్తలు
- తాజాగా ఈ వ్యతరేకత రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆటంకం కలిగిస్తుందా అన్న సందేహాలు భారతీయుల్లో రేకెత్తుతున్నాయి
- ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఎనమండుగురిలో ఇప్పటికే ఎలిమినేటయిన ఐదుగురు
- జులై 20న జరిగే ఐదో రౌండ్లో పోటీలో నిలిచే ఇద్దరి పేర్లు తేలతాయి
- 1,60,000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు వీరి నుంచి యూకే ప్రధానిని ఎన్నుకుంటారు
- ఓట్ల లెక్కింపు ఆగస్ట్ చివరి వారంలో సాగుతుంది. సెప్టెంబర్ 5న అధికారికంగా ప్రధాని పేరు వెల్లడి కానుంది
అక్షతాతో పరిచయం.. వివాహం
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో రిషి సునాక్ కు పరిచయం
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో ఉషకు రిషితో పరిచయం ఏర్పడింది
అనంతరం ఈ పరిచయం ప్రేమగా మారింది
నాలుగేళ్ల తర్వాత బెంగళూరులో 2009లో వీరి వివాహం జరిగింది
ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు
సంపన్నుల కుటుంబం..
- ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె జన్మతః సంపన్నురాలు..
- సంపన్నుడు నారాయణ మూర్తి అల్లుడుగా పేరుపొందిన రిషి సునాక్
- అటు రిషి సునాక్ భార్య అక్షతా సైతం సంపాదనలో ముందుంది
- పలు దేశాల్లో వ్యాపార సంస్థలను కలిగివున్న అక్షతా
- మరోవైపు 2009లో అక్షతా డిజైన్స్ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ను స్థాపించిన అక్షతా
- సొంత వ్యాపారాలే కాక ఇన్ఫోసిస్ లో 0.9శాతం వాటా కలిగివున్న అక్షతా
- ఆమె సంపదలో అధిక భాగం ఇన్ఫోసిస్ వాటానే..
- ఈ వాటా ద్వారా లభించిన సంపద 400 మిలియన్ పౌండ్లు(రూ.3,981 కోట్లు)
- బ్రిటన్ రాణి ఎలిజబెత్ సంపద 365 మిలియన్ పౌండ్లు(రూ. 3,633 కోట్లు మాత్రమే
- 2010లో నారాయణమూర్తి బ్రిటన్‌లో ప్రారంభించిన వెంచర్ క్యాపిటల్ బిజినెస్ క్యాటమరాన్ వెంచర్స్‌కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అక్షతా
- బ్రిటన్ లో రిషి-అక్షతా దంపతులకు నాలుగు ఉన్నాయని సమాచారం
అక్షతా ఆస్తులతో రిషికి చిక్కులు..
-
బ్రిటిష్ రాణి కంటే ధనవంతులుగా పేరుపొందిన అక్షతా-రిషి సునాక్ దంపతులు
-
మీడియాలో వీరి సంపద గురించి చర్చనీయాంశంగా మారింది.
-
అక్షతా రష్యాలో ఒక కంపెనీ కలిగివుందని అక్కడి నెత్తుటి డబ్బుతో డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించిన మీడియా
-
రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రిషి దంపతులు అక్కడి కంపెనీ నుంచి డబ్బును సంపాదిస్తున్నారని విమర్శలు
-
ఈ నేపథ్యంలో మీడియా వేదికగా భార్యకు మద్దతగా నిలిచిన రిషి సునాక్
-
అక్షతా నాన్ డొమిసిల్(శాశ్వత నివాసం యూకే బయట ఉందని) కేటగిరిలో తన నివాసాన్ని చూపెట్టడంతో యూకేలో పన్నులు కట్టాల్సిన అవసరం లేదు
-
2021లో ఇన్ఫోసిస్ షేర్ల ద్వారా11.6 మిలియన్ పౌండ్ల డివిడెండ్ పొందిన అక్షతా మూర్తి
-
అక్షతా నానా డొమిసిల్ కేటగిరీలో ఉండటంతో బ్రిటన్ చట్టం ప్రకారం యూకేలో ఆమె పన్నులు కట్టనవసరం లేదు
ఈ పన్నులు కట్టడంపై వివాదం..
అక్షతా మూర్తి ఏ తప్పూ చేయలేదు ఆమె భారత పౌరురాలు, ఆమె భారత్ పాస్ పోర్ట్ ను కలిగివున్నారు. భారత్ లోని ఆస్తులకు సంబంధించిన పన్నులను భారత్ లోనే పన్ను కడతారని మరో వాదన కొనసాగుతోంది. అక్షతా- రిషీ సునాక్ దంపతులు యూకేలో ఉంటున్నప్పుడు ఇక్కడే పన్నులు ఇక్కడే కట్టాలంటూ కొంతమంది విభేదిస్తున్నారు. ధనికులందరికి ఒకే నిబంధనలుంటాయని మరికొందరు వాదిస్తున్నారు. రిషి సునక్ గ్రీన్ కార్డ్, ఆయన భార్య పన్ను వివాదాల కారణంగా యూకే తదుపరి ప్రధానమంత్రిగా రిషి ఎన్నికయ్యే అవకాశాల్లేని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నాన్-డొమిసిల్ స్థితి ద్వారా అక్షతా మూర్తి ప్రతీ ఏటా 2.1 మిలియన్ పౌండ్ల (రూ. 20 కోట్లు) పన్నును తప్పించుకునే వీలుందని ఓ మీడియా సంస్థ అంచనా వేయడం చర్చనీయాంశంగా మారింది.
క్లారిటీ ఇచ్చిన అక్షతా..
విదేశీ ఆదాయంపై యూకే లో పన్నులు కడతానని అక్షతా ప్రకటించారు. పన్ను ఏర్పాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు 2022 ఏప్రిల్ 8న అక్షతామూర్తి చెప్పారు. తన వల్ల తన భర్తకు చీకాకు కలగకూడదంటూ అక్షతా తెలిపారు. తన పన్ను వ్యవహారాలన్నీ చట్టబద్ధమైనవనంటూ అక్షతా ప్రకటించారు.
బోరిస్ రాజీనామా..
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అపద్ధర్మ ప్రధానిగా బోరిస్ కొనసాగుతున్నారు.
తన సన్నిహితుడు మాజీ ఎంపీ క్రిస్ పించర్ సెక్స్ స్కాండల్, పార్టీ గేట్ కుంభకోణంతో విమర్శల పాలైన బోరిస్ జాన్సన్ బోరిస్ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడానికి సిద్ధపడ్డ కన్సర్వేటివ్‌లు
ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడానికి ప్రక్రియను ఆ పార్టీ ఎంపీలు ప్రారంభించారు. ఈ పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా నిలిచిన వ్యక్తే ప్రధానిగా ఎన్నికవుతారు
ప్రధాని పదవి రేసులో ముందుగా 8 మంది ఉన్నారు. మొత్తం ఐదు రౌండ్లలో జరిగే పోల్‌లో కన్జర్వేటివ్ ఎంపీలు రహస్య ఓట్లు వేసి ఎన్నుకుంటారు. ఎన్నిక ఆరుగురు ఎలిమినేషన్ వరకు కొనసాగుతుంది.
జులై 19నాటికి ముగిసిన నాలుగు రౌండ్లలో రిషి సునాక్ టాప్ లో కొనసాగుతున్నారు. జులై 20న జరిగే చివరి రౌండ్ లో పోటీలో నిలిచే ఇద్దరి పేర్లు ఖరారు కానున్నాయి.
చివరి రౌండ్లో నిలిచిన ఇద్దరి నుంచి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు.
కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను టోరీలను పిలుస్తుంటారు. కన్జర్వేటివ్ పార్టీ టోరీస్ పార్టీ నుంచి ఆవిర్భవించింది. ఈ పార్టీ సభ్యులకు మరోపేరు టోరీస్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..