UK PM Race: బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ..
బుధవారం జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో రిషి సునాక్‌కి అత్యధిక ఓట్లు దక్కాయి. రేసులో ఎనిమిది మంది ఎంపీలు ఉండగా.. 88 ఓట్లతో నెంబర్ వన్‌గా నిలిచారు రిషి సునాక్.
Rishi Sunak – UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్. తొలి రౌండ్ ఓటింగ్‌లో రిషి సునాక్‌కి అత్యధిక ఓట్లు లభించాయి. కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌ని ఎన్నుకునే ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది ఎంపీలు రేసులో నిలిచారు. ఈ పార్టీ లీడర్‌గా ఎవరు నిలుస్తారో వారే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో రిషి సునాక్‌కి అత్యధిక ఓట్లు దక్కాయి. రేసులో ఎనిమిది మంది ఎంపీలు ఉండగా.. 88 ఓట్లతో నెంబర్ వన్‌గా నిలిచారు రిషి సునాక్. తొలిరౌండ్‌లో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆరుగురు బరిలో ఉన్నారు. ఈరోజు, రేపు కూడా తదుపరి రౌండ్లు జరగనున్నాయి. రేసులో చివరికి ఇద్దరు మిగిలేవరకు ఈ ఓటింగ్స్ జరగనున్నాయి. బ్రిటన్ ఆర్ధిక శాఖ మాజీ మంత్రిగా ఉన్న రిషి సునాక్‌కు అటు ప్రజల్లో ఇటు పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది.
యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావడంతో పార్టీ కూడా ఆయనవైపే మొగ్గుచూపుతోంది. ఈ ఓటింగ్‌లో రిషి సునాక్‌కి 88 ఓట్లు వస్తే.. ట్రేడ్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్‌కి 67 ఓట్లు వచ్చాయి. ఇక ఫారెన్ సెక్రటరీ లిజ్ ట్రస్‌కి 50 ఓట్లు లభించాయి. ఈ ట్రెండ్స్ చూస్తుంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై వచ్చిన ఆరోపణలతో బ్రిటన్లో రాజకీయ పరిణామాలు మారాయి. మంత్రుల రాజీనామా అనంతరం.. బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అనంతరం పార్టీ మీటింగ్ తర్వాత ఈ ఓటింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఓటింగ్స్ అనంతరం మిగిలిన చివరి ఇద్దరి మధ్య కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ జరుగుతుంది. ఇందులో పార్టీ సభ్యులు లక్షా 80వేల మంది పాల్గొంటారు. సెప్టెంబర్ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..