Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DearNothing controversy: పీకల్లోతు వివాదంలో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ! డియర్ నథింగ్‌.. నీ అంతు చూస్తాం..

నథింగ్ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ 1 విక్రయాలు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లతో సంబంధం లేకుండా, డియర్‌ నథింగ్‌ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ (#DearNthing) దక్షిణ భారత్‌లో ట్రెండ్‌..

DearNothing controversy: పీకల్లోతు వివాదంలో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ! డియర్ నథింగ్‌.. నీ అంతు చూస్తాం..
Nothing Phone
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2022 | 8:49 PM

Why #DearNothing, #BoycottNothing trending on social media: దేశీయ మార్కెట్‌లో బడా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ నథింగ్‌ ఫోన్‌ 1 మంగళవారం (జులై 12) విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే నథింగ్‌ కంపెనీ నెట్టింట తెగ ట్రోల్‌ అవుతోంది. లండన్‌కు చెందిన స్టార్టప్ నథింగ్ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ 1 విక్రయాలు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లతో సంబంధం లేకుండా, డియర్‌ నథింగ్‌ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ (#DearNthing) దక్షిణ భారత్‌లో ట్రెండ్‌ అవుతోంది. నెటిజన్లంతా నథింగ్‌ కంపెనీపై మండిపడుతూ ట్వీట్లు పెడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా టెక్ కమ్యూనిటీ నుంచి భారీ సంఖ్యలో నథింగ్‌ కంపెనీ ఫౌండర్‌ కార్ల్ పీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..

ప్రముఖ యూట్యూబ్‌ ఛానెల్‌ ‘Prasadtechintelugu’ నథింగ్‌ ఫోన్‌ 1కు సంబంధించి ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. ఈ రోజు సాయంత్రం వీడియో విడుదలైన తర్వాత నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి నథింగ్‌ ఫోన్‌ 1 దక్షణ భారతీయులకు కాదని చెబుతూ కంపెనీ ఫోన్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తాడు. బాక్స్‌ ఖాళీగా ఉంటుంది. లోపల ఫోన్‌ ఉండదు. ఐతే ఆ ఖాళీ బాక్స్‌లో ఓ లెటర్‌ ఉంటుంది. ఆ లెటర్‌లో ‘దిస్‌ డివైజ్‌ ఈజ్‌ నాట్‌ ఫర్‌ సౌత్‌ ఇండియన్‌ పీపుల్‌’ అని ఉంటుంది. అంతకు మించి కంపెనీ వివరాలేవీ ఆ లెటర్‌లో కనిపించవు. దీంతో డియర్‌ నథింగ్‌ వీడియో వ్యవహారం నెట్టింటదావానంలా వేగంగా పాకింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇండియాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసి, దక్షిణ భారతీయులకు మాత్రం కాదని చెప్పడం వెనుక కంపెనీ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దక్షిణ భారతీయులు కూడా ఇండియాలో భాగమేనని పెద్ద ఎత్తున్న ఈ కంపెనీపై విమర్శలు చేస్తున్నారు.

ఐతే ట్విస్ట్‌ ఏంటంటే.. అసలు నథింగ్‌ కంపెనీ సదరు లెటర్‌ రాయనే లేదు. అదొక ప్రాంక్‌ వీడియో. నథింగ్ ఫోన్ 1కు సంబంధించిన రివ్యూ యూనిట్లు లేకపోవడాన్ని నిరసిస్తూ ఈ వీడియోను రూపొందించాడట. నిజానికి రివ్యూ యూనిట్లను పంపడం, పంపకపోవడం పూర్తిగా కంపెనీ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. దీని కోసం సదరు యూట్యూబర్‌ ఫన్నీగా వీడియో తీస్తే.. అదికాస్తా నెట్టింట తీవ్ర దుమారం లేపింది. నథింగ్‌ కంపెనీ పేర ట్రెండ్‌ అవుతోన్నలేఖ నకిలీదని, భారతదేశంలోని ఏ కమ్యూనిటీని ఉద్దేశించి అవమానకరవ్యాఖ్యలు చేయలేదని తెలియక పెద్ద సంఖ్యలో వినియోగదార్లు ఫన్నీ మీమ్స్‌తో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఐతే తాజా ఘటనపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.