JIPMER Recruitment 2022: జిప్‌మర్‌లో భారీగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER).. నర్సింగ్ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్ తదితర పోస్టుల (Nursing Officer Posts) భర్తీకి..
JIPMER Nursing Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER).. నర్సింగ్ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్ తదితర పోస్టుల (Nursing Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 139
పోస్టుల వివరాలు: నర్సింగ్ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నాషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: అర్హతలు, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర విషయాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 250
- పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 21, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.