OU Exams 2022: ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలన్నీ వాయిదా..!
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంసెట్‌తోపాటు పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో..
Osmania University Exams Postponed: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంసెట్‌తోపాటు పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపట్నుంచి (జులై 14) ఈనెల 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదావేయాలని కోరుతూ తెలంగాణ విద్యాశాఖ బుధవారం (జులై 13) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ ప్రకటించింది. దీంతో జులై 14 నుంచి జులై 16 వరకు జరగవల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన ఈ పరీక్షల షెడ్యూల్‌ను తర్వాతలోనే ప్రకటిస్తామని ఓయూ వెల్లడించింది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు జులై 16వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ సర్కార్ విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు ప్రకటింటించింది. దీంతో పాఠశాలలు తిరిగి సోమవారం (జులై 18) తెరుచుకోనున్నాయి. ముందుగా ప్రకటించిన విధంగా విద్యా సంస్థలు గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో అప్రమత్తమై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.