Sleeping Tips: రాత్రిళ్లు మీకు నిద్ర పట్టడం లేదా? ఇలా చేశారంటే వెంటనే..
నిద్రలేమి.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న కామన్ ప్లాబ్లెం. రాత్రిపూట నిద్ర సరిగా పట్టడం లేదని డాక్టర్లను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీని వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. రోజువారీ పనులు కూడా చురుగ్గా చేసుకోలేరు. పడుకోగానే మంచి నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. అవేంటంటే..
Updated on: Jul 13, 2022 | 5:18 PM

నిద్రలేమి.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న కామన్ ప్లాబ్లెం. రాత్రిపూట నిద్ర సరిగా పట్టడం లేదని డాక్టర్లను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీని వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. రోజువారీ పనులు కూడా చురుగ్గా చేసుకోలేరు. పడుకోగానే మంచి నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. అవేంటంటే..

నిద్ర పట్టకపోతే రాత్రి పడుకునే ముందు వెచ్చని నాళ్లతో స్నానం చేయండి. స్నానం చేసే నీళ్లో పుదీనా నూనెను కూడా జోడిస్తే.. ఒత్తిడిని, అలసట ఇట్టే మాయమవుతుంది.

నిద్ర సమయంలో బిగుతుగా ఉండే బట్టలు అస్సలు ధరించకూడదు. జీన్స్, టైట్ టీ-షర్టులు వంటి బట్టలు ధరించడం మానుకోవాలి. వీటికి బదులు పైజామా, ఓపెన్ టీ-షర్టులు వంటివి ధరించి, రాత్రి పడుకోవడం వల్ల రిలాక్స్‌గా అనిపిస్తుంది.

రాత్రి పడుకునే ముందు అధికంగా ఆహారం తీసుకోకూడదు. ఈ ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే మంచి నిద్ర కోసం రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడకూడదు. దీని నుంచి వెలువడే కిరణాలు మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. పడుకోవడానికి 3 గంటల ముందు నుంచి ఫోన్ వాడకం ఆపివెయ్యాలి. ఈ చిట్కాలు పాటిస్తే మీ నిద్ర హాయిగా ఉంటుంది.