యూజీ అడ్మీషన్లకు ఆఖరు తేదీ.. యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు

సీబీఎస్సీ ఫలితాల ప్రకటన తర్వాత మాత్రమే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువు నిర్ణయించవల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఛైర్మన్‌ జగదీష్ కుమార్ బుధవారం (జూలై 13) దేశ..

యూజీ అడ్మీషన్లకు ఆఖరు తేదీ.. యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు
Cbse
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2022 | 4:53 PM

Admissions in undergraduate courses 2022: సీబీఎస్సీ ఫలితాల ప్రకటన తర్వాత మాత్రమే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువు నిర్ణయించవల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఛైర్మన్‌ జగదీష్ కుమార్ బుధవారం (జూలై 13) దేశ వ్యాప్తంగాఉన్నయూనివర్సిటీలను కోరారు. సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు ఇంకా విడుదలవ్వని విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాయి. 12వ తరగతి ఫలితాల కంటే ముందే ఆయా యూనివర్సిటీల్లో యూజీ ప్రవేశాలకు తుది గడువు ముగిస్తే.. సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసిన విద్యార్ధులు నష్టపోయే అవకాశం ఉందని జగదీష్ కుమార్ ఈ రోజు ట్విటర్ వేదికగా తెలియజేశారు.

అందువల్ల సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ చివరి తేదీలను విడుదల చేయాలన్నారు. తద్వారా సీబీఎస్సీ విద్యార్థులకు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అన్నారు. కాతా యూనివర్సిటీల్లో దరఖాస్తులకు చివరి తేదీలను తెలియజేయాలని గత వారం సీబీఎస్సీ బోర్డును అభ్యర్ధించింది. దీంతో యూజీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాయి. ఐతే సీబీఎస్సీ ఫలితాల ప్రకటన కంటే ముందే యూనివర్సిటీల్లో చివరి తేదీ ముగిసినట్లయితే సీబీఎస్సీ విద్యార్థులు ప్రవేశానికి దూరమయ్యే అవకాశం ఉంది. కారణంగా ఈ సంవత్సరం బోర్డు పరీక్షల షెడ్యూల్ ఆలస్యమయ్యింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జులై నెలాఖరు నాటికి విడుదలవనున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.