AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIESL Recruitment 2022: నెలకు రూ.2,00,000ల జీతంతో.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIESL).. ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్ పోస్టుల (AME Posts) భర్తీకి దరఖాస్తులు..

AIESL Recruitment 2022: నెలకు రూ.2,00,000ల జీతంతో.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Aiesl
Srilakshmi C
|

Updated on: Jul 13, 2022 | 3:49 PM

Share

AIESL Trainee Aircraft Maintenance Engineer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIESL).. ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్ పోస్టుల (AME Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి B1, B2 మాడ్యులర్స్‌/హెచ్‌ఏ/జేఈ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డీజీసీఏ నిర్వహించిన నాలెడ్జ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: james.stephanose@aiesl.in

అడ్రస్: the office of Chief Human Resources Officer, AIESL, Hqrs., 2nd floor, CRA Building, Safdarjung Airport, New Delhi 110003 not later than 18-07-2022.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.750
  • ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌అభ్యర్ధులకు: రూ.450

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.