UCIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో కొలువులు..రూ.2,40,000ల జీతం..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (UCIL).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టుల (Deputy General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

UCIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో కొలువులు..రూ.2,40,000ల జీతం..
Ucil
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2022 | 8:07 AM

UCIL Jharkhand Deputy General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (UCIL).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టుల (Deputy General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 6

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టులు

విభాగాలు: సివిల్‌, మిల్‌, మైన్స్‌, స్టోర్స్‌, పర్చేజ్‌విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.90,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: జనరల్‌ మేనేజర్‌, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, జాదుగూడ్‌ మైన్స్‌, ఝార్ఖండ్‌-832102.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.