ESIC Recruitment 2022: రూ.2,40,000ల జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాతపరీక్షలేకుండానే..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు చెందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ (ESIC-PGIMSR).. ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల (Super Specialist Posts) భర్తీకి..

ESIC Recruitment 2022: రూ.2,40,000ల జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాతపరీక్షలేకుండానే..
Esic
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2022 | 8:00 AM

ESIC New Delhi Super Specialist Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు చెందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ (ESIC-PGIMSR).. ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల (Super Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 20

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సూపర్ స్పెషలిస్ట్‌, కన్సల్టెంట్‌ పోస్టులు

విభాగాలు: కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటిరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, సర్జికల్‌ ఆంకాలజీ, నియోనాటాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 67 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్:

  • సూపర్ స్పెషలిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • కన్సల్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

అడ్రస్: 5th Floor, Admn. Block MS Building, Dean Office, ESI-PGIMSR, Basaidarapur, Delhi-15.

దరఖాస్తు రుసుము: రూ. 500

ఇంటర్వ్యూ తేదీ: జులై 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.