Ministry of Textile Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.92,000ల జీతం..

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ (NMML).. గ్రూప్‌ 'సీ' నాన్‌ గెజిటెట్‌ పోస్టుల (Group 'C' non ministerial Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Ministry of Textile Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.92,000ల జీతం..
Ministry Of Textiles
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2022 | 8:07 PM

Ministry of Textiles Group C Recruitment 2022: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ (NMML).. గ్రూప్‌ ‘సీ’ నాన్‌ గెజిటెట్‌ పోస్టుల (Group ‘C’ non ministerial Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 29

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • జూనియర్‌ వీవర్‌ పోస్టులు: 7
  • సీనియర్‌ ప్రింటర్‌ పోస్టులు: 2
  • జూనియర్‌ అసిస్టెంట్ (వీవింగ్‌, ప్రాసెసింగ్‌) పోస్టులు: 4
  • అటెండెంట్ (వీవింగ్‌, ప్రాసెసింగ్‌) పోస్టులు: 16

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.18,000 నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ (స్పీడ్ పోస్టు) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Ministry of Textiles, office of the development commissioner for handlooms, weavers service centers, weavers colony, bharat nagar, Delhi-110052.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 24, 2022 (ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.