TS ECET 2022: తెలంగాణ ఈసెట్‌ 2022 పరీక్ష వాయిదా.. ఆ పరీక్షలు మాత్రం యథాతథం!

తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం (జులై 11) ప్రకటించారు..

TS ECET 2022: తెలంగాణ ఈసెట్‌ 2022 పరీక్ష వాయిదా.. ఆ పరీక్షలు మాత్రం యథాతథం!
Ts Ecet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2022 | 6:23 PM

TS ECET 2022 Exam Postponed: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం (జులై 11) ప్రకటించారు. ఈ రోజు ఈసెట్ కన్వీనర్లతో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి నిర్వహించిన ఉన్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జులై 13న నిర్వహించవల్సిన ఈసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈసెట్ తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇక జులై 14, 15 తేదీల్లో జరగవల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షల్లో మార్పు ఉండబోదని, ఆయా పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ఈ నెల 18, 19, 20వ తేదీల్లో జరుగనున్నట్టు తెలిపారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.inను సందర్శించవల్సిందిగా లింబాద్రి ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు.

కాగా ఈసెట్‌ పరీక్ష జూలై 13న రెండు షిఫ్టుల్లో, ఒకే రోజులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో జరగవల్సి ఉంది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ భారీ వర్షాల కారణంగా దీనిని వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది. ఈ ఏడాది కూడా జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు