Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: ఇక ఆ దేశంలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల హక్కు.. చట్టబద్ధంగా!

కరోనా అదుపులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావడానికి పలు విధానాలను అవలంభిస్తున్నాయి. ఐతే ఈ యూరోపియన్‌ దేశం మాత్రం రోటిన్‌కు భిన్నంగా ఆలోచించి ఉద్యోగుల అభీష్టానికే పెద్ద పీట వేస్తోంది. వివరాల్లోకెళ్లే..

Work From Home: ఇక ఆ దేశంలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల హక్కు.. చట్టబద్ధంగా!
Work From Home
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2022 | 3:57 PM

work from home: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడ్డారు. కరోనా అదుపులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావడానికి పలు విధానాలను అవలంభిస్తున్నాయి. ఐతే ఈ యూరోపియన్‌ దేశం మాత్రం రోటిన్‌కు భిన్నంగా ఆలోచించి ఉద్యోగుల అభీష్టానికే పెద్ద పీట వేస్తోంది. వివరాల్లోకెళ్లే..

నెదర్లాండ్స్ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇక చట్టబద్ధంకానుంది. ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును చట్టబద్ధ హక్కుగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు డచ్ పార్లమెంట్ దిగువ సభ (Lower House) గత వారం ఆమోదం తెలిపింది. సెనేట్ ఆమోదం కూడా పొందితే ఈ యూరోపియన్ దేశంలో వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులకు చట్ట బద్ధ హక్కుగా పరిణమించనుంది. ఐతే ప్రస్తుతానికి మాత్రం నెదర్లాండ్స్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కారణం తెలుపకుండా వర్క్‌ ఫ్రం హోం చేస్తుంటే దానిని తిరస్కరించే హక్కు యజమాన్యాలకు ఉంటుంది.

కొత్త చట్టం సెనెట్‌ ఆమోదం పొందిన తర్వాత, యజమానులు ఇటువంటి అభ్యర్థనలన్నింటినీ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగుల అభ్యర్ధనలను తిరస్కరిస్తే అందుకుగల కారణాలను యాజమన్యం విధిగా తెల్పవలసి ఉంటుంది. మెరుగైన పనితనానికి, ప్రయాణ సమయాలను ఆదా చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని గ్రోన్‌లింక్స్ పార్టీకి చెందిన సెన్నా మాటౌగ్ మీడియాకు తెలిపారు. నెదర్లాండ్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్ 2015 (Netherland’s Flexible Working Act of 2015)కు సవరణ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. దీనివల్ల పని గంటలు, షెడ్యూల్‌, వర్క్‌ ప్లేస్‌లను మార్చుకోవడానికి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తుంది. కాగా నెదర్లాండ్స్‌లో కార్మికుల హక్కులకు ఇప్పటికే మంచి పేరుంది. తాజా చట్టంతో అక్కడి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చూకూరనుంది.

ఇవి కూడా చదవండి

టెస్లా సీఈఓ అయిన ఎలోన్ మస్క్ ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీసులకు రావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కూడా. టెస్లా బాటలోనే మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి పలు రకాలుగా ఒత్తిడి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నెదర్లాండ్స్ వర్క్‌ ఫ్రం హోంను చట్టబద్ధ హక్కుగా మర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నిర్ణయంపై కంపెనీల ప్రభావం ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడవల్సిందే!

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.