Delhi Police Constable Recruitment 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! 1411 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC ladakh) ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ..

Delhi Police Constable Recruitment 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! 1411 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌
Ssc Constable Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 10, 2022 | 8:33 AM

SSC Delhi Police Constable (Driver) Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC ladakh) ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన పురుష అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 1411

ఇవి కూడా చదవండి

కేటగిరీవారీగా ఖాళీలు:

  • జనరల్ కేటగిరీ: 604,
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ: 142
  • ఓబీసీ కేటగిరీ: 353
  • ఎస్సీ కేటగిరీ: 262
  • ఎస్టీ కేటగిరీ: 50

పోస్టులు: కానిస్టేబుల్ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు: ఇంటర్‌ (10+2)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకుగానూ 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 90 నిముషాల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్‌ మెన్‌/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2022 రాత్రి 11 గంటల వరకు.

రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.