SSC Constable Recruitment 2022: ఇంటర్ అర్హతతో.. 857 పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్సెస్సీ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ladakh) ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/టెలీ-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
SSC Delhi Police Head Constable Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ladakh) ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/టెలీ-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 857
పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.
కేటగిరీవారీగా ఖాళీలు:
- హెడ్ కానిస్టేబుల్ (పురుషులు) పోస్టులు: 573
- హెడ్ కానిస్టేబుల్ (మహిళలు) పోస్టులు: 284
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ (10+2)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మెకానిక్-కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఐటీఐ) ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకుగానూ 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 90 నిముషాల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2022 రాత్రి 11 గంటల వరకు.
రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.