AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaurav Taneja: పాపులర్ యూట్యూబర్‌ గౌరవ్ తనేజా అరెస్ట్‌! ఓ పిచ్చిపనికి నెట్టింట తెగ ట్రోలవుతున్నాడు..

ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజాను శనివారం (జులై 9) పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు వేల సంఖ్యలో మెట్రో స్టేషన్‌ వద్ద గుమి గూడటంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు గౌరవ్‌ తనేజాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్లే..

Gaurav Taneja: పాపులర్ యూట్యూబర్‌ గౌరవ్ తనేజా అరెస్ట్‌! ఓ పిచ్చిపనికి నెట్టింట తెగ ట్రోలవుతున్నాడు..
Gaurav Taneja
Srilakshmi C
|

Updated on: Jul 10, 2022 | 10:57 AM

Share

YouTuber Gaurav Taneja Arrested: ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజాను శనివారం (జులై 9) పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు వేల సంఖ్యలో మెట్రో స్టేషన్‌ వద్ద గుమి గూడటంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు గౌరవ్‌ తనేజాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్లే.. ‘ఫ్లైయింగ్‌ బీస్ట్‌ (Flying Beast), ఫిట్‌ మజిల్‌ టీవీ (Fit Muscle TV), రస్భరీ కే పాప (Rasbhari Ke Papa)’ అనే యూట్యూబ్ ఛానెళ్లతో అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. అతని మూడు చానెళ్లకు 75.8 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతని ఫిట్‌ నెట్‌ వీడియోలు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించి పెట్టాయి.

ఐతే శనివారం నాడు గౌరవ్ తనేజా పుట్టిన రోజు కావడంతో నోయిడాలోని సెక్షన్‌ 51 మెట్రో స్టేషన్‌లో బర్త్‌డే వేడుకలను జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌కు మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోవల్సిందిగా కోరాడు. గౌరవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.3 మిలియన్ల, అతని భార్య రీతూకి 1.6 మినియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భర్త బర్త్‌డే వేడుకలను జరుపుకోవడానికి గానూ అతని భార్య రీతూ మొత్తం మెట్రో స్టేషన్‌ను బుక్‌ చేసినట్లు, అధిక సంఖ్యలో అభిమానులను కలవనున్నట్లు రీతూ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌కు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా అప్పటికే పెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్ట్యా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా వేడుకలు నిర్వహించినందుకు గానూ పోలీసులు వివిధ సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన కొన్ని గంటల్లోనే ఈ వార్త నెట్టింట దావానంలా పాకింది. గౌరవ్‌ను వెంటనే రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో అతని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో