Tamil Nadu: బర్త్ డే పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు.. నమ్మి వెళ్తే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు

పుట్టినరోజు పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెతో సరదాగా ఫొటో దిగాడు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని దారుణంగా పాల్పడ్డాడు. అతనే కాకుండా తన స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా వీడియో తీసి మిగతా...

Tamil Nadu: బర్త్ డే పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు.. నమ్మి వెళ్తే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 10, 2022 | 11:02 AM

పుట్టినరోజు పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెతో సరదాగా ఫొటో దిగాడు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని దారుణంగా పాల్పడ్డాడు. అతనే కాకుండా తన స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా వీడియో తీసి మిగతా ఫ్రెండ్స్ కూ షేర్ చేశాడు. వాళ్లూ బాలికను వేధించడం మొదలు పెట్టారు. వారి వేధింపులు తాళలేక బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లాకు చెందిన బాలిక చెన్నైలోని (Chennai) ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే స్కూల్​లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి బాలిక కూడా వెళ్లింది. కేక్ కట్ చేసే సమయంలో యువకుడు ఆ బాలికతో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటో తీసుకునేందుకు ఇంటికి రావాలని కోరాడు. అతని మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన బాలికపై యువకుడు, అతని ఇద్దరు స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతే కాకుండా దారుణాన్ని సెల్​ఫోన్ లో వీడియో తీశారు. ఆ వీడియోను మిగతా స్నేహితులకు పంపించాడు. దాన్ని చూసిన మరో వ్యక్తి.. వీడియో సహాయంతో బాధితురాల్ని బెదిరించాడు. వారి వేధింపుతులు తాళలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. వెంటనే అప్రమత్తమైన ఆమె ఘటనపై స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద నలుగురినీ అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

క్రైం వార్తల కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు