Shocking Video: రద్దీ రోడ్డుపై ఘోర ప్రమాదం.. వీడియో చూస్తే వణికిపోతారు.. నెటిజన్లు షాక్‌!

ట్రక్ డ్రైవర్ పొరపాటు భయంకరమైన ప్రమాదానికి కారణమవుతుంది. అతని వల్ల అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో ఓ కారు యజమాని తప్పు కూడా ఉంది.

Shocking Video: రద్దీ రోడ్డుపై ఘోర ప్రమాదం.. వీడియో చూస్తే వణికిపోతారు.. నెటిజన్లు షాక్‌!
Shocking Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 11:50 AM

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఓవర్‌టెక్‌, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపించడం, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇటీవల, రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 2020 సంవత్సరంలో దేశంలో 1 లక్షకు పైగా ప్రాణాంతక ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో జాతీయ రహదారిపై 35 శాతం, రాష్ట్ర రహదారిపై 25 శాతం ప్రమాదాలు జరిగాయి. అయితే, ప్రమాదాల బాధితులు కేవలం అజాగ్రత్త లేదా తప్పు చేసేవారు మాత్రమే కాదు, ఇతర వ్యక్తులు కూడా బలికావాల్సి వస్తోంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ట్రక్ డ్రైవర్ పొరపాటు భయంకరమైన ప్రమాదానికి కారణమవుతుంది. అతని వల్ల అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో ఓ కారు యజమాని తప్పు కూడా ఉంది. అసలు విషయంలోకి వెళితే..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పెద్ద పెద్ద పైపులను ఎక్కించుకుని రోడ్డుపై ట్రక్కు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో ఒక కారు అకస్మాత్తుగా ట్రక్కు కిందకి ప్రవేశించింది. ఆ తర్వాత ట్రక్కు సడెన్‌గా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే ట్రక్ నుండి పైపులన్నీ వాటికవే కిందకు పడిపోవడంతో ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థంకాలేదు. అంతలోనే ట్రక్కు కిందకి ప్రవేశించిన కారు ప్రమాదానికి గురవుతుంది. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. అక్కడ సీన్‌ మొత్తం చూసేవారిని షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @ViciousVideos అనే IDతో షేర్ చేయబడింది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్‌ రాగా, లైకులు, కామెంట్లు హోరెత్తాయి. వీడియో చూసిన నెటిజనం.. రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. ‘ఇది నిజం కాకపోవచ్చు’ అని కొందరు, ‘ఇది సినిమాలోని సన్నివేశం’ అని కొందరు అంటే, ఈ ప్రమాదాన్ని జనం నమ్మలేకపోతున్నారు అంటున్నారు మరికొందరు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?