Billionaires Shift: కోటీశ్వరుల వలస బాట పట్టారు.. వారంతా ఎక్కడికి వెళ్తున్నారు..? ఎలా తప్పించుకుంటున్నారు..?
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాల్లోని కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల సంస్థ హెన్లే అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాల్లోని కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల సంస్థ హెన్లే అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది. ఈ ఏడాది 8 కోట్ల చరాస్తులు కలిగిన వ్యక్తులు 88 వేల మంది స్వదేశాలను వీడొచ్చని హెన్లే నివేదిక అంచనా వేసింది. ఇంతకీ వీరందరూ తమ స్వదేశాలను ఎందుకు వీడుతున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈసారి అత్యధికంగా కోటీశ్వరులు వీడుతున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారి నుంచి బయటపడేందుకు రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని సంపన్నులు తమ దేశాలను వీడుతున్నారు. ఇటు భారత్ నుంచి కూడా 8 వేల మంది విదేశాలకు వెళ్లిపోవచ్చని అంచనా వేసింది.అత్యధిక మంది కోటీశ్వరులు స్థిరపడేందుకు ఎంపిక చేసుకునే దేశాల జాబితాలో యూఏఈ తొలిస్థానంలో ఉంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు యూఏఈ అనుసరిస్తున్న వలస విధానాలు ఇందుకు కారణం.నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెడితే విదేశీ పౌరసత్వం లభిస్తుందనో లేదా శాశ్వత నివాస హక్కు పొందవచ్చనో నచ్చిన దేశానికి కోటీశ్వరులు క్యూ కడుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు మెరుగైన భద్రత, రక్షణ కోరుకునే వారు, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించాలనుకునే మిలియనీర్లు వలసల వైపు మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?