Bear Attack: నాతోనే నాటకాలా..? అందరి ముందు స్టేజ్ పైనే ట్రైనర్‌పై కసితీర్చుకున్న ఎలుగుబంటి.. వైరలవుతున్న వీడియో

సింహం, చిరుత, మొసలి, ఏనుగులకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి.

Bear Attack: నాతోనే నాటకాలా..? అందరి ముందు స్టేజ్ పైనే ట్రైనర్‌పై కసితీర్చుకున్న ఎలుగుబంటి.. వైరలవుతున్న వీడియో
Bear Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 10:20 AM

Bear Attack Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి.అందులో జంతులకు సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగులకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా ఎలుగుబంటి ట్రైనర్‌పైనే దాడి చేసిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

మీలో చాలా మంది పల్లెల్లో జరిగే డ్యాన్ బేబీ డ్యాన్స్ లు, నాటకాలు, కోతులు, గుర్రాలు, ఏనుగులు వంటి యానిమల్స్ తో రకరకాల విన్యాసాలు చేయించడం ఇప్పటి వరకు చాలానే చూసి ఉంటారు. అయితే, తాజాగా ఓ ఊరిలో ఎలుగుబంటితో ప్రోగ్రాం చేస్తున్నారు కొందరు నిర్వాహకులు. ఇందులో మెుదట శిక్షకుడితో కలిసి ఎంతో చక్కగా ప్రదర్శన ఇచ్చింది ఎలుగుబంటి. ఏమైందో తెలియదు కానీ స్టేజ్ పై ఉన్న ట్రైనర్ పై ఒక్కసారిగా దాడి చేసింది ఆ ఎలుగుబంటి. అతడిని తీవ్రంగా గాయపరిచింది. అక్కడ ఉన్నవారు భల్లూకాన్ని తప్పించి అతడిని కాపాడారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇలా జంతువులను షోలకు ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా తమదైన శైలిలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి