Funny Video: మేకపోతు గాంభీర్యం.. కొమ్ములున్నాయని ఎగిరిపడింది.. ఎద్దు ఏం చేసిందో తెలిస్తే తిక్కకుదిరింది అంటారు..!

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మేకపోతు గాంభీర్యానికి సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్‌ వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత అర్ధం అవుతుంది.. అర్థం లేకుండా ఎవరినైనా ఆటపట్టించడం వల్ల ఫలితం ఎలాఉంటుందో..

Funny Video: మేకపోతు గాంభీర్యం.. కొమ్ములున్నాయని ఎగిరిపడింది.. ఎద్దు ఏం చేసిందో తెలిస్తే తిక్కకుదిరింది అంటారు..!
Goat Tease Ox
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 8:57 AM

Funny Video: మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే, వన్యప్రాణులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలను చూడవచ్చు. జంతువులకు సంబంధించిన వీడియోలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు ఇతర వీడియోల కంటే వేగంగా వైరల్ కావడానికి ఇదే కారణం. కొన్ని వీడియోలలో జంతువుల ఫన్నీ రియాక్షన్‌లు కనిపిస్తే, మరికొన్ని వీడియోలలో వాటి మధ్య విపరీతమైన పోరు జరుగుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలాంటి వీడియో ఒకటి హల్‌చల్‌ వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత అర్ధం అవుతుంది.. అర్థం లేకుండా ఎవరినైనా ఆటపట్టించడం వల్ల ఫలితం ఎలాఉంటుందో..

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మేకపోతు.. కోపంతో వేగంగా దూసుకొచ్చి కట్టేసి ఉన్న ఓ ఎద్దును ఢీకొట్టింది. దాంతో ఆ ఎద్దు ఊరుకుంటుందా.. దాని కొమ్ములతో ఒక్కసారిగా పైకి ఎత్తి కుదేసింది. తాడుతో కట్టేసి ఉందికదా..నన్నేం చేస్తుందిలే అనుకుందో ఏమోగానీ, మేకపోతు ఎద్దుపై ప్రతాపం చూపించాలని ప్రయత్నించింది. కానీ, మేకపోతుకు గట్టి గుణపాఠం చెప్పింది ఎద్దు. రెప్పపాటులోనే మేకపోతు లేపి నేలకేసి బాదటంతో.. ఆ మేక తిరిగి పైకి లేవను కూడా లేదు.

ఇవి కూడా చదవండి

ఈ క్లిప్‌ను యానిమల్స్ వరల్డ్ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కామెంట్ల ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అర్థం లేకుండా ఎవరూ తమ గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది మరీ..అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, తగ్గి ఉన్నారు కదా అని మనకంటే బలవంతులను ఆటపట్టించాలని చూస్తే తగిన శాస్తి తప్పదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..