Telugu News Trending Dog's attempt to stop wastage of water from Tap Video has gone viral on social media
Viral Video: చేస్తేనే కాదు కొన్ని చూసినా అర్థమయిపోతాయి.. ఈ కుక్క ముందు జాగ్రత్తకు సెల్యూట్ అనాల్సిందే
సమస్త ప్రాణకోటికి నీరు జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవీ బతకలేదు. అందుకే నీటిని వృథా చేయకుండా కాపాడుకునే అవసరం ఎంతో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సరైన తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే.. మరికొందరు మాత్రం నీటిని....
సమస్త ప్రాణకోటికి నీరు జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవీ బతకలేదు. అందుకే నీటిని వృథా చేయకుండా కాపాడుకునే అవసరం ఎంతో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సరైన తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే.. మరికొందరు మాత్రం నీటిని విపరీతంగా వృథా చేస్తున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక కుక్క నీరు తాగిన తర్వాత ట్యాప్‌ను ఆపివేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుక్క ముందు జాగ్రత్తను విశేషంగా మెచ్చుకుంటున్నారు. నల్లా దగ్గర నీళ్లు తాగేందుకు వచ్చిన ఓ కుక్క.. ట్యాప్ తిప్పి నీళ్లు తాగుతుంది. తాగడం అయిపోయాక నీరు వృథా కాకుండా ఉండేందుకు ట్యాప్ బంద్ చేస్తుంది. నీటి పొదుపునకు ఈ వీడియో సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. కుక్క తెలివితేటలను చూసిన నెటిజన్లు దానిని ప్రశంసిస్తున్నారు.
ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ 12 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 96 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కుక్క చేసిన మంచి పని ఎందరో హృదయాలను గెలుచుకుందని, నీటి ఆవశ్యకతను ఈ వీడియో మరింత వివరంగా చెప్పిందని కామెంట్లు చేస్తున్నారు.