Draupadi Murmu: జూలై 12న హైదరాబాద్‌కు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆమెకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీను ఆమె కలవనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ రానున్న ముర్ము.. ఆ రోజు తెలంగాణ మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొంటారు.
ద్రౌపది ముర్ము కోల్‌కతా పర్యటన రద్దు..
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ శాసనసభ్యులను కలిసేందుకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము జూలై 9వ తేదీ అనగా ఈరోజు కోల్‌కతా వెళ్ళాల్సి ఉండగా.. జపనీస్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి సంతాపం తెలుపుతూ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.