Bonalu 2022: ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం.. రేపు, ఎల్లుండి జరగనున్న లష్కర్‌ బోనాల జాతర

ఇప్పటికే తొలి బోనాలు ఉత్సవం గోల్కొండలో జూలై 3న జరిగింది. రేపు ఆదివారం లష్కర్‌, జూలై 17న లాల్ దర్వాజ, జూలై 24న పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. 18న రంగం, భ‌విష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు

Bonalu 2022: ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం.. రేపు, ఎల్లుండి జరగనున్న లష్కర్‌ బోనాల జాతర
Bonalu 2022
Follow us

|

Updated on: Jul 09, 2022 | 5:28 PM

Bonalu 2022: ప్రతి ఏడాదిలానే ఆషాఢ మాసం రావడంతోనే హైదరాబాద్‌లో బోనాల పండుగ‌ మొదలఅయింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్స‌వాలు ఈసారి కూడా ఘనంగా జరుగుతున్నాయి. మొదట్లో కేవలం భక్తులకే పరిమితమైన బోనాల పండుగకు కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల హడావిడి కూడా తోడయ్యింది. ఈ ఏడాది ఆషాఢమాసం బోనాలు జూన్‌ 30న ప్రారంభమయ్యాయి. జూలై 28 వరకూ కొనసాగనున్నాయి. తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పట్టువస్త్రాలు సమర్పించారు.

బోనం అంటే ఏంటి? భోజ‌నం ప్రకృతి అయితే.. దాని వికృతి ప‌ద‌మే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మ‌వారి కోసం మ‌ట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ త‌ర్వాత‌ బోనాల కుండ‌ల‌ను వేప రెమ్మ‌ల‌తో, ప‌సుపు, కుంకుమ‌తో అలంక‌రించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా త‌యారు చేసిన బోనాల‌ను త‌ల‌పై పెట్టుకుని డ‌ప్పు చ‌ప్పుళ్లతో మ‌హిళ‌లు ఆల‌యానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండ‌ల‌ను ఇలా బోనం నైవేద్యంగా స‌మ‌ర్పించే తంతును ఊర‌డి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. బోనాల జాతర‌ కేవ‌లం అమ్మ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించ‌డంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబురాల‌కు సంబంధించిన ప్రతి ఘ‌ట్టమూ ఇందులో క‌నిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి క‌ర్రలు, కాగితాల‌తో చేసిన అలంకారాలు స‌మ‌ర్పించ‌డం, రంగం పేరిట భ‌విష్యవాణి చెప్పే ఆచార‌మూ ఈ బోనాల పండుగ‌లో ఉంటుంది. అమ్మవారిని ఘ‌టం రూపంలో స్థాపించ‌డం, ఆ ఘ‌ట్టాన్ని నిమ‌జ్జనం చేయ‌డ‌మూ మ‌నం చూడ‌వ‌చ్చు. మొత్తం మీద జాన‌ప‌ద క‌ళ‌లు, డ‌ప్పుల చ‌ప్పుళ్లు, శివ‌స‌త్తుల విన్యాసాల‌తో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. బోనాలకు హైదరాబాద్‌ నగరం ప్రసిద్ధి చెందినప్పటికీ.. తెలంగాణ అంతటా ఈ పండుగను జరుపుకుంటారు. గ్రామ దేవ‌త‌ల‌కు ప‌సుపు కుంకుమ‌లు, చీర‌సారెలు, భోజ‌న నైవేద్యాల‌తో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైస‌మ్మ, పోచ‌మ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ.. ఇలా శ‌క్తి స్వరూప‌మైన అమ్మవార్ల వ‌ద్ద త‌మ‌ను చ‌ల్లగా చూడ‌మ‌ని వేడుకుంటారు. త‌మ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆప‌ద రాకుండా ర‌క్షించ‌మ‌ని ప్రార్థిస్తారు. ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది

బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి? 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు, గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురి అయ్యాము అని తలచి భయభక్తులతో అమ్మవారిని శాంతిపచేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందు కూడా కొన్ని సంవత్సరాల్లో బోనం పండుగ జరిగినట్లు ఆధారాలున్నాయి.15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్లమ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి, బోనాలు స‌మ‌ర్పించార‌ట‌. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్లమ్మగుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి, ఆ దేవ‌త‌కు బోనాలు స‌మ‌ర్పించిన‌ట్టు కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్‌ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న..అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్‌దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం, బల్కంపేట ఆలయం, మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది. ఇప్పటికే తొలి బోనాలు ఉత్సవం గోల్కొండలో జూలై 3న జరిగింది. రేపు ఆదివారం లష్కర్‌, జూలై 17న లాల్ దర్వాజ, జూలై 24న పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. 18న రంగం, భ‌విష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు

రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు… కరోనా కారణంగా.. గత రెండేళ్లుగా బోనాలలో సందడి తగ్గింది. దీంతో.. ఈసారి బోనాల ఉత్సవాలను.. ఎంతో ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల కోసం 15 కోట్లు కేటాయించినట్లు చెపుతోంది టీఆర్ఎస్‌ ప్రభుత్వం. ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌ సమీక్షించారు. చార్మినార్‌ వద్ద 500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు సిబ్బందిని కూడా మోహరించినట్లు మంత్రి చెప్పారు

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు.. దేశరాజధాని ఢిల్లీలో ఏడేళ్లుగా మహంకాళి ఆలయ కమిటీ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల కోసం రాష్ట్రం నుంచి 300 మంది భక్తులు, కళాకారులు ఢిల్లీ వెళ్లారు. ఉత్సవాల్లో భాగంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు డోలు దరువులు, అమ్మవారి వేశధారణాలు, పులి వేశాలు ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఢీల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు ఇస్తామని ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పాల్గొని, మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని గతేడాది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!